Monday, October 18, 2010

మహేష్ ‘ఖలేజా’ ప్లాప్ కి సునీలే కారణమా..!?



‘మగధీర’ సినిమాలోని డైలాగులని తలపించే కీలక సన్నివేశాన్ని కథలో పెట్టడం ద్వారా త్రివిక్రమ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్ ని చూడగానే షపీకి ఎలాంటి వైబ్రేషనన్స్ వస్తాయనేది రావు రమేష్ చెప్పే సీన్ ‘మగధీర’ లోని ఒక సన్నివేశంతో పోలి ఉండడంతో ‘ఖలేజా’ సీన్ లో ఒరిజినాలిటీ లోపించింది. అయితే ఈ సీన్ ని ముందుగా త్రివిక్రమ్ రాసుకున్నాడని, అది తన స్నేహితుడు సునీల్ కి చెబితే అతనెళ్లి రాజమౌళి  కి లీక్ చేశాడని, అది సినిమాలో పెట్టేసుకున్న రాజమౌళి గిప్టుగా సునీల్ తో ‘మర్యాద రామన్న’ చేశాడని ఒక రూమర్ ఫిలింనగర్ లో స్ప్రెడ్ అవుతోంది.

ఈ గాసిప్ సష్టికర్త ఎవరో కానీ నిజంగా కథలు రాయడం మొదలు పెడితే ‘మగధీర’ ని మించిన హిట్టిచ్చేయగలడు. ‘మగధీర’ సీన్ ఇన్ స్పిరేషన్ తో త్రివిక్రమ్ ఒక సన్నివేశం రాసుకుంటే, అతని కాపీ క్యాట్ నేచర్ ని ఎండగట్టక రాజమౌళి మీదకు నెపం నెట్టేయడం కంటే వెర్రీతనం మర్రొక్కటుండదు. ఒక్క సీన్ లీక్ చేస్తే అంతటి పెద్ద డైరెక్టర్ తనతో సినిమా చేసేటట్టయితే సునీల్ ఇక అదే 
పని  మీద ఉండొచ్చు. ఒక వేళ తన సీన్ నే ‘మగధీర’ లో కాపీ కొట్టుంటే త్రివిక్రమ్ దానిని మరోలా మార్చుకోలేడా? అదే సీన్ కి తానయితే ఎలా డైలాగులు రాసేవాడో చూపించడానికి ఈ సీన్ పెట్టినట్టుంది కానీ ‘ఖలేజా’ కథకి అంత ఆ సీన్ అవసరమా అని చూసిన వాళ్లు 

No comments: