Monday, October 4, 2010

నా జీవితం లో నిన్న జరిగిన ఒక "ఆదివారం" సంఘటన...

శనివారం  రాత్రి  అల్లారం పెట్టుకున్న నాలుగింటికి లేవడానికి కానీ అల్లారం మోగలేదు దాంతో ఆరింటికి ట్రైన్ అయతే నేను 5:30 కీ లెచ...గబా గబా అన్ని ముగించుకొని స్టేషన్ కీ వెళ్ళ కానీ ప్పటికే "జన్మభూమి" నాకు ట్రైన్ లో భూమి లేకుండా చేసి తుర్ర్ మని పారిపోయింది.......ఎం చేస్తాం అనుకోని "సింహాద్రి" కీ టికెట్ తీసుకున్న.


పరీక్షా 10 గంటలకి ఆది కూడా సెంటర్ "తుని" లో ఇచ్చాడు "గ్రూప 4" వాడు...వైజాగ్ నుంచి తుని కీ express కాబట్టి రెండు గంటల్లో వెళ్ళచ్చు...సింహాద్రి ఏమో 7:10 కీ కరెక్ట్ గా టైం కీ వెళ్తే 9:30 కీ వెళ్ళచ్చు దేవుడి మీద బారం వేసి ట్రైన్ ఎక్కా.....కాసేపు చదువుకున్న దువ్వాడ...అనకాపల్లి......ఎలమంచిలి.....నరిసిపట్నం.....ఇవి  చాలవు అన్నటు ఏదో కశింకోట అంట అక్కడ పావుగంట ఆపేసాడు అప్పటికే టైం 9:15 అయిపోయింది...ఏదో ఆపసోపాలు పడుతూ 9:45 కీ చేరుకుంది తుని లో......గబా గబా సెంటర్ కీ వెళ్లి EXAM హాల్ లోకి వెళ్ళ PAPER-1 general knowledge ఏదో బాగా రాస....12:30 కీ పరీక్షా అయిపోయింది.....


అదేమ సెంటర్ రా బాబు.....అసలు ఈ కాలేజీ నీ సెంటర్ గ పెట్టినందుకు గవర్నమెంట్ నీ అనాలి...ఎక్కడ అయిన కాలేజీ లో కూర్చోడానికి బల్లలు ఉంటాయి అదేమ విచాత్రమో కానీ EXAM HALL కీ వెళ్ళగానే దిమ్మ తిరిగింది.......ఏదో బోజనలికి వచ్చినట్టు షామియానా బల్లలు నలుగు వేసి కుర్చీలు వేసి ఏదో సామెత చెప్పినట్టు "తంబులాలు ఇచ్చేసాం ఇంక తన్నుకుసవండి" అన్నట్టు బల్లలు కుర్చీలు వేసాం రాసి పొండి అన్నట్టు వేసారు.....ఎం చేస్తాం మన కర్మ అనుకోని ఉదయం పరీక్షా పూర్తిచేస.....


మధ్యానం 2 గంటలికి ఇంకో పరీక్షా....ఉదయం నుంచి ఎం తినలేదు కదా ఆకలి వేస్తుంది అని చుట్టూ ప్రక్కల చుసా  అబ్బే! ఎం ప్లేస్ రా నాయన ఏమి లేవు....నాలుగూ ఇడ్లీ లు ఐదు రూపాయలు అంట....ఇడ్లీలు చూస్తే రెండు రూపాయి బిల్లల ఉంది.....తినేస తప్పదు......


వరద బాధితుడు ల చెట్టు కింద కూర్చొని కాసేపు లెక్కలు కుస్తీ పట్టా......రెండు అయింది లేచి వెళ్ళ పరీక్షా కీ....పేపర్ ఇచ్చాడు అన్ని తెలిసినవి లానే ఉన్నాయి కానీ ANSWERS మాత్రం గుర్తు రావడంలేదు.....


4:౩౦ కీ అయిపోయింది పరీక్షా...బయట ఆటో వాడు అరుస్తున్నాడు  Railway  స్టేషన్ కీ అని....వెళ్లి  కూర్చున్న స్టేషన్ వచ్చింది.....వాడికి ఐదు ఇచ్చి....లోపలి వెళ్లి ఉదయం నా నుంచి తప్పించుకున్న  "జన్మభూమి" నీ ఈ సారి వదల వదల అని టికెట్ తీసుకోని సిద్ధం గా ఉన్న.....ట్రైన్ వచ్చింది ఎక్కా....


పేరుకే "జన్మభూమి" అందులో కూర్చోడానికి ఉండదు మనకు భూమి....నుంచున్న ట్రైన్ కదిలింది.....ఎవరు అయిన చిన్న చోటు ఇస్తే వచ్చే జన్మ లో వాళ్ళకి ట్రైన్ కొనిపెడత అన్నానంత ఆశ గ చుసా అబ్బే చాలు చాలు చలే......అని చూసారు.....


ఒక సీట్ దగ్గర నుంచున్న....అసలు మమత ధీ ధీ.....ఆ సీట్ ముగ్గురి కోసం వేయించిన మనసు తో కూర్చుంటే నలుగురు కుర్చోవచ్చు......కానీ ఆ పెళ్లి అయిన అక్క.....ఎం చేస్తాం పెళ్ళవక  పోతే ఇంకోల పిలిచేవాడిని.....అవిడి గారిని చూస్తున్న చోటు ఇస్తుంది ఏమో అని.....మన ఇంట్లో ఉండే పీట కన్నా పెద్ద మటం వేసుకొని కూర్చుంది.....ఏదో పితాధిపతి కూర్చున్నట్టు......కూర్చున్న తల్లి కూర్చుంద....తుని నుంచి మేసుతునే ఉంది......


నేను ఏమి సీట్ ఇవ్వలేదు అని అవిడి గారిని తిట్టడం లేదు......నా కళ్లారా చుసా.....అమ్మో! పప్పు మెషిన్ అయిన కాసేపు ఆగుతుంది కానీ... అమ్మడు ముందు "పాప్ కార్న్" తిన్నది.....మొగుడు మళ్ళి ఏదో సంచి ఇచ్చాడు...పసుపు రంగులో ఉంది ఆది అందుకుంది మొదలు దవడలు కూడా జడిసిపోయాయి అమ్మ గారి మేత కీ....


పాప్ కార్న్ తర్వాత లడ్డు...తర్వాత మరమరాలు......న్యూస్ ఛానల్ ANCHOR అమ్మ ల కాసేపు బ్రేక్ ఇచ్చింది అప్పుడు గణ పదార్ధం కాకుండా ద్రవ పదార్ధం లగించింది.......ఈ లోపు అనకాపల్లి వచ్చింది......మహా తల్లి కీ ఎక్కడ వినబడిందో కానీ సమోసా వాడు పక్కన ఉన్న మేము జడుసుకునే ల అరిచింది.......వాడు వచ్చాడు ఇచ్చాడు...ఆయిన గారు పరుసు లో డబ్బులు ఇచ్చారు....


ట్రైన్ కదిలింది....మళ్ళి మొదలు సమోసా......కిళ్ళి...నములుతూ ఒక పసుపు కాగితం తీసింది బయటికి....అప్పుడు అర్ధం అయింది ఈవిడ గారు కీ ఇన్ని ఎక్కడివి అని.....


బారసాల కీ వెళ్లి వచ్చింది....బారసాల పేరు చెప్పి సస్త్తిపుర్తి కీ సరిపడవి తెచ్చుకుంది......నాకు కాళ్ళు పికేస్తునాయి ఏమి చేయాలో అర్ధం కావడం లేదు.....దువ్వాడ లో ఒక దేవుడు దిగిపోయాడు...హమయ్య అనుకోని అక్కడ కూర్చున్న ఇప్పుడు ఇంకో కథ.....


ఎంసెట్ కౌన్సుల్లింగ్ కీ వెళ్తునారు అనుకుంట తల్లి కూతుళ్ళు...ట్రైన్ లో ఎవరో చుట్టం కనిపించింది.....వాళ్ళతో తో సోది వేసాక వాళ్ళు అటు పక్కకి వెళ్లారు అంతే purse  లో నుంచి మొబైల్ తీసి అమ్మ కీ ఫోన్ కొట్టింది.....అమ్మ ఇలా వీళ్ళు కలిసారు ఈ రోజు రాత్రికే నంట ఉండి వెల్లిపోతం అంటున్నారు నేను వెళ్తున్న వాళ్ళ ఇంటికి తీసుకోని పోనా అని ....పాపం lodge లో ఎం ఉంటారు....దయ మూర్తి అమ్మ దగ్గర సెలవు తీసుకుంది.....


ఇంతలో తల్లి గారు కూతురు.....ఇలా అందుకుంది..."నీకు అసలు బుద్ధి ఉందా మనమే ఒక ఇంటికి చుట్టం గ వెళ్తున్నాం మళ్ళి తగుదునమ్మ అని వీళ్ళన..."సరిపోయింది తానూ దూరడానికి సందు లేదు కానీ మెడకో డోల అన్నటు.....అంది....


ఎంత బాగా చేపిందో సామెత...పిల్ల ఎంసెట్ మీద కన్నా సామెతల మీద పట్టు ఎక్కువ అనుకుంట.....ఇంతలో వైజాగ్ స్టేషన్ వచ్చేసింది......నాకు ఎందుకు బాబు అని దిగిపోయి మళ్ళి ఐదు రూపాయిలు ఇచ్చుకొని ఇంటి దగ్గర దిగ....


వెళ్ళగానే అమ్మ క్లాసు పికింది.....అసలు కనీసం ఫోన్ చేయాలి...పరీక్షా ఇలా రాసాను అని చెప్పే అలవాటు లేదు ఏంటి రా నీకు.....అప్పుడు నాకు కోపం వచ్చి నేను అన్న "అంత మిరే చేసారు......." అని మొదలు పెట్టబోతుంటే నోరుమూసుకొని బుక్కుతావ్ ఏమో బుక్కి పడుకో.....అని ఆర్డర్ వేసి కింద అక్క ఇంటికి వెళ్ళింది ఊసులు ఆడడానికి....


అంత మర్యాద గా చెప్పినపుడు మూసుకొని తిని పడుకొని లేచి...మొకానికి కొంచెం సున్నం కొట్టి ఆదే ఆదే పౌడర్ కొట్టి ఇదిగో ఆఫీసు కీ వచ్చా......రాగానే మా బాస్ జాబు వచేస్తుంద పేపర్ చాలా సింపుల్ గా ఇచ్చాడు అంట కదా....


వాడి బాధ వాడిది.....ఎక్కడ జాబు వచేస్తే వాడి న్యూస్ ఛానల్ లో స్క్రిప్ట్ రాసే వాడు దొరకడు అని వాడి బాధ వాడిది......


ఇది న జీవితం లో నిన్న జరిగిన సంగటన......విసుగుపుట్టిస్తే సారీ........కామెంట్ చేయండి ఎలా ఉందో.....

No comments: