Monday, November 15, 2010

జెమిని టీవీ లో ‘ఖలేజా’ నీ కడిగేసిన తనికెళ్ల భరణి


కొత్త సినిమాల్లోని ప్రముఖులతో ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం 24 ఫ్రేమ్స్ (జెమిని ఉ.8.30)లో చెత్త చిత్రాన్ని కూడా పొగడటమే పనిగా పెట్టుకున్నారు. ఐతే అక్టోబర్ 20న తనికెళ్ల భరణి ‘ఖలేజా’ చిత్రం గురించి ఎంతో నిజాయితీగా చెప్పారు. నీళ్ల కోసం అంత హంగామా అవసరమా? ఒకరో ఇద్దర్నో రక్షించడానికి ఐదు వందల మందిని చంపాలా? హీరోని బ్రహ్మాండంగా చూపిస్తూ ఇతర పాత్రల పట్ల శ్రద్ధ చూపకపోతే ఎలా? అవసరానికి మించి ఎక్కువగా ఫిలిం ఎక్స్‌పోజ్ చేసి ఎడిటర్‌కి బలి ఇవ్వడం సరికాదని కుండబద్దలు కొట్టడం బాగుంది. జాబ్ శాటిస్‌ఫాక్షన్ తప్ప ‘జేబు’ శాటిస్‌ఫాక్షన్ లేనందువల్లనే రచన కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చానని నిజాయితీగా ఒప్పుకున్నారు. భేష్.

మీరు ఎం అంటారు...