Tuesday, November 16, 2010

నితిన్‌తో నటించిన హీరోయిన్ వలస పోవాల్సిందే.......



నితిన్ రెడ్డి కుర్ర హీరోల్లో తనదైన ముద్ర వేసుకున్న కథానాయకుడు. "జయం"తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ యువహీరో సరసన ఏ హీరోయిన్ నటించినా సదరు హీరోయిన్ మెల్లగా పరభాషా చిత్ర పరిశ్రమలో సెటిలవడం ఖాయమని ఫిలిమ్ నగర్ జనం జోస్యం చెపుతున్నారు. ఇందుకు వారు కొన్ని ఉదాహరణలు కూడా చూపుతున్నారు.

జయం చిత్రంలో నితిన్ సరసన నటించిన సదా, ఆ తర్వాత ఒకట్రెండు తెలుగు సినిమాలు మాత్రమే చేయగలిగింది. కానీ అదే సమయంలో కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమల్లో బాగా రాణించింది. ఆ తర్వాత ఇదే దారిలో చాలామంది నడిచారు.

బొద్దందాల నిఖిత కూడా ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో చేరిపోయింది. నితిన్ సరసన నటించిన ఈ తార ప్రస్తుతం మాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమపైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నానని చెపుతోంది.

No comments: