Thursday, March 11, 2010

EM MAYA CHESAVE.....MOVIE REVIEW


మాయ చేసిన మంచి ప్రేమ కథ......

ప్రేమ భావనను ఒక్కసారైనా జీవితంలో పలకరించినవారికి మాత్రం..కచ్చితంగా నచ్చితీరుతుంది.....

కొసమెరుపు ఏమిటంటే 80వ దశకంలో వచ్చిన తొలి యవ్వనప్రేమ చిత్రమైన సీతాకోకచిలుకతో తెరగ్రేటం చేసిన హీరో పేరు కార్తీక్..ఈ సినిమాలో కథానాయకుడి పేరు అదే..రెండు సినిమాల్లోనూ కథానాయిక క్రిస్టియన్..అదీ సంగతి........

FINAL ANALYSIS : HIT........Excellent Movie and Good Love Story saw after So many Days in 70MM...........

గడచిన దశాబ్ధంలో చాలా టీనేజీ ప్రేమకథల సినిమాలు వచ్చి వుండొచ్చు. కాలేజీ నేపథ్యం..లెక్చరర్ల వెకిలి వేషాలు.. బీర్ పానీయ సేవనాలు..ఇంకా..ఇంకా ఎన్నో వెకిలి చేష్టలతో..డైలాగులతో..ప్రేమ సినిమా అంటేనే వెగటు పుట్టేలా చేసినవి..కానీ అలాంటి వెకిలి తనానికి కిలోమీటర్ల దూరంలో నిలిచిన సినిమా "ఏమాయ చేసావే".............

ఇది డైరక్టర్ సినిమా........ఇంకా కచ్చితంగా చెప్పాలంటే..ఒక సరైన దర్శకుడు..మాటల రచయిత..సినిమాటోగ్రాఫర్ ..సంగీతమాంత్రికుడు.. కలిస్తే..వెండితెర ఆధారంగా ప్రేక్షకులను ఎంత భావుకతకు గురిచేయగలరన్నదానికి ఈ సినిమా ఒక ఉదాహరణ.........ఇందులో ముద్దులు న్నాయి.. అరడజనుకు పైగా లిప్ టు లిప్ ముద్దుల సీన్లు..జనరేషన్ నెక్ట్స్..పెద్దవాళ్లకు నచ్చకున్నా తప్పదు..కానీ ఎబ్బెట్టుగా లేవు..ఆ దృశ్యాలే కాదు..సినిమాలో దాదాపు చాలా దృశ్యాలు..ప్రేక్షకుల గుండెను..ఒక్క అర సెకెండ్ చేత్తో పట్టి ఆపినట్లు.................

కథ పెద్ద గొప్పది కాదు..సినిమాలో ఫైట్లు లేవు.. కామెడీ ట్రాక్..దాని కోసం..వేరే నటులు లేరు..వున్నది హీరో హీరోయిన్..వారి కుటుంబ సభ్యులు..ఆరుగురు..హీరో నేస్తం, నటుడు కృష్ణుడు.........

UNIT PERFORMANCE

NAGA CHAITANYA : కార్తీక్ (నాగచైతన్య) ఇంజినీరింగ్ చేసి, సినిమా దర్శకత్వం వైపు వెళ్లాలని యోచించే కుర్రాడు....పాత్రలో నాగ చైతన్య చక్కగా చేసాడు........గౌతమ్ మీనన్ నాగ చైతన్య నీ ఎంతవరకు ఎలా చూపితే బాగుంటుందో అలా చూపించే టెక్నిక్ అనుసరించాడు. అసలు సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు దాదాపు 99శాతం ఫ్రేమ్‌లు హీరోహీరోయిన్లు వుండేలా స్క్రిప్ట్ తయారుచేసుకోవడం ఓ విశేషం. మిగిలిన ఒకశాతం సీన్లలో అయితే హీరో లేదా హీరోయిన్‌లో ఒకరు కచ్చితంగా వున్నారు..........

SAMANTHA : సినిమా టైటిల్ మొదట్లో మనకి ఎక్కలేదు....కానీ చిత్రం చుసిన తర్వాత "సమంత....." చేసిన మాయ మీకు నేను చెప్పకర్లేదు........దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రతి సీన్‌ను.. ఫ్రేమ్‌ను తన సహచర సాంకేతిక నిపుణులతో కలసి ప్రేక్షకజన రంజకంగా తీర్చిదిద్దాడు. దానికి కళ్లతోనే మాటాడగల కొత్త నటి సమంత తోడైంది..........

DIRECTOR గురుంచి నాకన్నా మీకు ఇంకా బాగాతెలుసు..........పోతే..స్వరమాంత్రికుడు రెహమాన్ పాటల సంగతి పక్కన పెడితే, నేపధ్యసంగీతం..వాహ్..అనిపించాడు.ఇళయరాజా నేపథ్యసంగీతాన్ని గుర్తుకుతెచ్చాడు. ఇక మనోజ్‌పరమహంస ఛాయాగ్రహణం అత్యంత నాచురల్‌గా వుంది. లైటింగ్‌తో ప్రయోగాలు చేయకుండా నీట్‌గా వుంది. వీలయినంత వరకు క్లోజప్ షాట్లు..ముఖ్యంగా హీరోయిన్‌పై..వాడడం బాగుంది. మాటలు తమిళ వెర్షన్‌కు తెలుగు అనువాదాలు కాకుంటే, కనుక కచ్చితంగా మాటల రచయిత................ఉమర్జీ అనూరాధకు క్రెడిట్ ఇవ్వాల్సిందే..అలాగే హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పిన అమ్మాయి (చిన్మయ)కు కూడా...........

1 comment:

pvkarthik said...

hey it's ooooooosam