Saturday, September 11, 2010

మాటీవీ లో "అతడు" సినిమా నా లేక సీరియల్ నా.....?



మాటీవీ లో "అతడు" సినిమా నా లేక సీరియల్ నా.....?

మనకీ రోజు టీవీ లో వచ్చే సీరియల్స్ గురుంచి తెలుసు...కానీ ఈ మంత్లీ సీరియల్ ఏంటి రా బాబు అని తిట్టుకోకండి......మన అందరి టీవీ అంటూ....వచ్చి కేవలం సినిమా కార్యక్రమాలు మీదే భతికేస్తున్న ఏకైక టీవీ ఛానల్ "మా టీవీ".........చీర కావాలన్నా ఎస్ఎంఎస్ చేయాలి...చీరలో వేసుకునే లంగా కావాలన్నా ఎస్ఎంఎస్ చేయాలి.....మీ చేతిలో మొబైల్ ఉంటె నే మా ఛానల్ చుడండి అనే స్థాయికి పోయింది సదరు టీవీ ఛానల్ వారు......
ఇంతకి చెప్పోచేది ఏమిటి అంటే........ఎలాగో మా ఛానల్ లో టీవీ సీరియల్స్ బాగుండడం లేదు కదా అని...."అతడు" సినిమా నీ నేలకీ తక్కువలో తక్కువ కాకుండా...రెండు మూడు సార్లు వేసి సినిమా తీసిన వాడినే "బాబోయ్......ఎందుకు రా బాబు ఈ సినిమా తీసిన అనే రేంజ్ కే తీసుకుపోయాడు,....."
మొదట్లో ఏదో బాగుంది అని చూస్తాం.....రెండో సారి ఏదో మళ్ళి చూదాం కామెడి బాగుంటుంది అని చూస్తాం......మూడో సారి ఏదో ముచ్చటపడుతున్నాడు అనుకుంటాం...మరి నాలుగో సారి వీడికి పిచ్చి అని సరిపెట్టేసికుంతం.......


అతడు.....మహేష్ బాబు....త్రివిక్రమ్ ల అద్భుత సినిమా......కానీ ఎంత అద్భుతం అయిన మరి ఇన్ని సార్ల.....?
కిందటి నెలలో రెండు సార్లు...."శుక్రవారం ఒకసారి.....ఆదివారం ఒకసారి....." మళ్ళి ఇప్పుడు...ఏమిటో ఇంత పిచ్చ అతడు అంటే.....
అయిన మన పిచ్చి కానీ.....వెనకటికి ఒకడు అన్నాడు అంట........."చూసేవాడు చూపించేవాడికి లోకవ అని......." మా టీవీ వారు తమ కాప్షన్ మన అందరి టీవీ కాకుండా......మాకు నచ్చిన టీవీ అని పెట్టుకోండి........
 
దీని మీద మీ స్పందన తెలపండి.....

  

4 comments:

ANALYSIS//అనాలిసిస్ said...

అతడు ఒక్కటే కాదండి బాబూ ... ఇలాంటి సినిమాలు మాటి.వి వాడి దగ్గర చాల ఉన్నాయి. చంద్రముఖి, పోకిరి, అశోక్, షాక్, చత్రపతి, ఇలాంటివి ఓ డజను సినిమాలు వాడి దగ్గరున్నాయి. వాటితో జనాన్ని చావగొడుతున్నాడు. ఇక నాగార్జున , వెంకటేష్, సుమంత్ సినిమాల గురించి అయితే చెప్పక్కరలేదు. కేవలం వీళ్లను ప్రమోట్ చెసుకోవడనికే మాటి.వి ఉన్నట్ట్లుంది. వీళ్ల ముగ్గురు మొఖాలు చూడలేక ఆ చానెల్ చూడ్డం మానేసాను. పరమ బోర్ ఆ చానెల్ చూడాలంటే. సినిమా మధ్య యాడ్స్ వేస్తున్నాడో లేక యాడ్స్ మధ్య సినిమా వేస్తున్నాడో అర్ధం కాదు. మాటి.వి చూసే ప్రేక్షకులకు ఉత్తమ సహన ప్రేక్షకుడు అవార్డు ఇవ్వొచ్చు .

DesiApps said...

ఒక అయిదారు సినిమాలు ఉన్నాయి వాటినే అటు తిప్పి ఇటు తిప్పి వేస్తుంటాడు.. చత్రపతి కూడా బలి అయ్యాడు ఈ విషయంలో

Anonymous said...

I watched this movie more than 50 times andi...such a good movie...ennisarlu chusina malli next time chudali anipisthundi.....

భాస్కర రామిరెడ్డి said...

Rajesh గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు

హారం