ఒకానొక సినిమా లో...ఒక డైలాగ్ ఉంటుంది..."కొందరిని చూస్తే కట్టుకోవాలని ఉంటుంది.....ఇంకొందరిని చూస్తే కరచి పరిపోవలిని ఉంటుంది"...నిజమే ఈ మాట "సిల్క్ స్మిత" విషయం లో మొదటదే వర్తిస్తుంది......సిల్క్‌స్మిత...ఈ పేరు వినగానే వయసుతో నిమిత్తం లేకుండా తాపం పెరిగి ఒళ్లు వేడెక్కుతుంది. మత్తెక్కించే ఆ మైకపు కళ్లు, నిషా చూపులు గుర్తొచ్చి గాల్లో శరీరం తేలిపోతున్నట్టవుతుంది.
ఇప్పటికి "బావలూ....సయ్య......" అనే పాట వినబడుతుంది అంటే కేవలం "సిల్క్ స్మిత" వల్లనే అని జగమెరిగిన సత్యం...
ఇంతగా రసిక జన హృదయాలను కొల్లగొట్టిన ఈ శృంగార తార పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1960 డిసెంబర్ 2న ఓ పేద కుటుంబంలో జన్మించింది. ఈమె అసలుపేరు విజయలక్ష్మి. కేవలం నాల్గవ తరగతి వరకు మాత్రమే చదివింది. కొత్త సినిమా రిలీజు కాగానే మొదటిరోజు మొదటి ఆట చూడడమే ధ్యేయంగా పెట్టుకుంది.....
అలా తమిళంలో ‘వండిచక్రం’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో సిల్క్ పాత్ర ధరించి సిల్క్‌స్మితగా పేరుపొందింది. ‘వండి చక్రం’ ఆధారంగా తెలుగులో దర్శకుడు కట్టా సుబ్బారావు రూపొందించిన సినిమాలో కూడా నటించింది. స్మిత తొలి తెలుగు సినిమా ‘్భదేవి’. ఇందులో ముఖ్యపాత్ర చేసింది కానీ ఈ సినిమా విడుదల కాలేదు....
తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నాట్యతారగా, నటిగా 200 సినిమాలకు పైగా నటించింది. ‘వీరవిహారం’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.....
స్వతహాగా స్మితకి భక్తి ఎక్కువ. ఇంటి ఆవరణలోనే దేవాలయం నిర్మించుకుని నిష్టగా పూజలు చేసేదట.
నమ్మిన వ్యక్తులు చేసిన మోసం కారణంగా ఆర్థిక ఇబ్బందులకు తాళలేక 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకుంది. దీని వెనక అనేక అపోహలు వున్నాయని అప్పటి పత్రికలు పేర్కొన్నాయి...
శృంగారపరంగా కనిపించేలా మునిపంటితో విల్లులాంటి కింది పెదవిని కొరికే ఆమె చేష్టలను మరువలేని శృంగార ప్రియులు సిల్క్‌స్మిత మసాలా సాంగ్స్ పేరుతో వెబ్‌సైట్లలో ఉంచి ఆశపుట్టినప్పుడల్లా వీక్షిస్తున్నారు.....
No comments:
Post a Comment