కింగ్, కేడి చిత్రాలతో పూర్తి స్ధాయిలో వెనక్కి వెళ్ళిపోయిన హీరోయిన్ మమతామోహన్ దాస్. గాయినిగానూ తెలుగులోనూ ఆఫర్స్ సంపాదించుకోలేక ఆపసోపాలుపడుతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగువారిపై ఓ కామెంట్ పారేసింది. తాజాగా ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ...తమిళ సిని పరిశ్రమ చాలా మేలు. అక్కడ గ్లామర్ తో పనిలేదు. వారు చాలా సెంటిమెంట్ జనాలు. అక్కడ అందాలు చూపిస్తే ఎక్కువ కాసం నిలబడలేం. కేవలం నటనకే ప్రాముఖ్యత. అదే తెలుగువారి విషయానికి వస్తే..వారి దృష్ఠి మా ఒంపుసొంపులపైనే. మా గ్లామర్ కే వారు ధియోటర్స్ కి వస్తారు. వారికి నటన విషయం అక్కర్లేదు అంటూ అక్కసు వెళ్ళబోసింది. అందుకే తెలుగులో చేసే పాత్రలు గ్లామర్ కే పరిమితం చేయాలి..మన నటన ప్రదర్శించాలని ఆశపడటం అనవసరం అని తేల్చేసింది. ఇంతకీ మమతామోహన్ దాస్ అధ్బుతమైన నటన చూపిన చిత్రం తెలుగులో ఏముందంటారు.
దీని ఫై మీ స్పందన కామెంట్స్ రూపం లో పోస్ట్ చేయండి.....
1 comment:
నిజమే చెప్పిందిగా....
Post a Comment