నాగార్జున హీరోగా నటిస్తున్న రాజన్న చిత్రంలో రాములమ్మకు పాత్ర దొరికిందట. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంగా నడిచే రాజన్న కథ కోసం నాగార్జున తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దగ్గర కొన్ని టిప్ప్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ బంధం కాస్తా పెరిగి తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి కి రాజన్నలో నటించే అవకాశం లభించిందని వినికిడి. ఓ ప్రత్యేక పాత్రలో రాములమ్మ తన లేడీ బాసిజాన్ని చూపుతారని అంటున్నారు. తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై రాణి రుద్రమదేవి చిత్రం తీయడానికి విజయశాంతి ఏర్పాట్లు చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. దాంతో ఇప్పుడు రాజన్న సినిమాలో నటించాలని విజయశాంతి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి విజయశాంతి జానకి రాముడు, జైత్రయాత్ర వంటి కొద్ది సినిమాల్లో మాత్రమే నటించారు. అయితే, ఈ సినిమాలో నాగార్జున సరసన రాములమ్మ హీరోయిన్ గా నటిస్తుందా, మరో ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందా అనేది ఉత్కంఠ రేపే విషయం.
1 comment:
Anonymous
said...
దాని బొంద షెడ్డు కేల్లిపోయిన విజయశాంతి ఇంకా హీరొయిన్ ఏంటి.. తెరాస భవన్ లో టీలు గుడుంబా పాకెట్లు సప్లయ్ చేస్తూ గడపొచ్చు.....
1 comment:
దాని బొంద షెడ్డు కేల్లిపోయిన విజయశాంతి ఇంకా హీరొయిన్ ఏంటి.. తెరాస భవన్ లో టీలు గుడుంబా పాకెట్లు సప్లయ్ చేస్తూ గడపొచ్చు.....
Post a Comment