Monday, November 29, 2010

రసం లేని పండు ఈ "అరేంజ్".....ఏడిసినట్టు ఉంది,,,,



"ఇంతన్నాడు అంతన్నాడీ నాగబాబు.....
ముంతమామిడి పండు అన్నాడే నాగబాబు.....

లవ్ అన్నాడు పువ్వు అన్నాడే భాస్కర్ బాబు....
మనోంట్లో కొవ్వు అంతా కరిగించాడే భాస్కర్ బాబు...."

పయిన మాటలు బట్టి తెలిసిపోతుంది "అరేంజ్" అనే లవ్ పండు కీ ఏన్ని బొక్కలు ఉన్నాయో.....

ముందుగా నాది ఒక మనవి...."సినిమా నీ సినిమాగా చూడు....అంతే కానీ ఎలాంటి బొక్కలు చూపించకు" లాంటి పనికిమలిని ఉచిత సలహాలు చాలా మంది నా బ్లాగ్ లో కామెంట్ చేస్తున్నారు,,,,,వాళ్ళందరికీ ఒకటే సమాదానం....మీకు నేను విమర్శించిన హీరో గారి మీద చాలా ప్రేమ అని అర్ధం చేసుకోగలను కానీ సినిమా నీ సినిమా గ చుస్తునం కాబట్టే మన సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గరే ఉంటున్నాయి....పక్కన ఉన్న తమిళ్....మలయాళం....కన్నడం వాళ్ళు సినిమా నీ రియల్ గా చూస్తున్నారు కాబట్టే వాళ్ళ సినిమాలు అవార్డలు వరకు వెళ్తున్నాయి.....

ఇప్పుడు నేను "అరేంజ్" మీద రాస్తున్న రివ్యూ నచ్చినవాళ్ళు కామెంట్ చేయచ్చు నచ్చని వాళ్ళు నా బ్లాగ్ నుంచి దొబ్బెయచ్చు.....ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ అని సరిపెట్టుకుంటా....

సరే ఇంకా మొదలుపెడదామ.....

థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల్లో చాలామంది యువతీయువకులే ఉంటారు. కాబట్టి ప్రేమకథతో వారిని చాలా సులభంగా ఆకట్టుకోవచ్చనేది తెలుగు దర్శకనిర్మాతల అభిప్రాయం. ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాల మాదిరిగా, దర్శకనిర్మాతలకు యూత్‌ అంశం చాలా ముఖ్యమైంది. దాంతో ప్రేమ కథలను తెరకెక్కించడంలో మన దర్శకుడు అనేక ప్రయోగాలకు దిగుతున్నాడు. అయితే ఆ ప్రయోగాలు సహజసిద్ధంగా, స్వచ్ఛంగా తెరపై తేలియాడాలి. కానీ హీరోను దృష్టిలో పెట్టుకొని కథనం నడిపిస్తే...అది అచ్చు...ఆరెంజ్‌లా ఉంటుంది. లవర్‌బారు ఇమేజ్‌ కోసం పడిన పాట్లు, ఫీట్లే ఈ సినిమా కథాంశం...

'వాడు చెప్పేది వినలేం. చూపేది చూడలేం. అర్థంకాక చస్తున్నా' ఒక సన్నివేశంలో చరణ్‌ను ఉద్దేశించి బ్రహ్మానందం ఇలా అంటాడు. సినిమా కూడా అదే విధంగా నడిచింది. సినిమా విడుదలకు ముందు ఒక టాక్‌ వచ్చింది. అదేంటంటే...దర్శకుడు భాస్కర్‌ బాగా ఖర్చు పెట్టించాడని, దాదాపు రూ.35 కోట్లు ఖర్చయిందని, దానికి చిరంజీవి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని ఇలాంటివి. అయితే రూ.35 కోట్లు కాదుగదా, అందులో సగం కూడా ఖర్చు పెట్టలేదని సామాన్య ప్రేక్షకుడి అభిప్రాయం. బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చుకునే ప్రయత్నం కోసమే ఈ సినిమా తీశాడని థియేటర్‌ బయటికొచ్చిన కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.....

'ప్రేమ అనేది ఇద్దరి మనసులను కొంతకాలం మాత్రమే కలుపుతుంది, నిలుపుతుంది. ఆ తర్వాత క్రమేపీ గాఢత తగ్గి నీరవుతుంది, నిప్పవుతుంది, చెత్తవుతుంది. జీవితాంతం ఒక జంట ప్రేమానుబంధంతో జీవిస్తారనేది అబద్ధం' అనే భారమైన డైలాగులు చరణ్‌ చేత చెప్పించడం చిరాకు తెప్పిస్తుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, అనుభవాన్ని రంగరించి తెలపడం వేరు, పాతికేళ్లు నిండని వ్యక్తితో పై డైలాగులు చెప్పించడం వేరు. దాంతో మొదటి అర్థభాగం దిశానిర్దేశం లేకుండా సాగింది. ఇదంతా హీరో ఎందుకు చేస్తున్నాడనేది రెండో సగంలో కానీ మనకు తెలియదు. దాంతో పరీక్షకొచ్చిన విద్యార్థుల్లా ప్రేక్షకులు మారారు....

రామ్‌పాత్రలో రామ్‌చరణ్‌ బాగానే చేశాడు. లవర్‌బారు గెటప్‌ రామ్‌చరణ్‌కు బాగానే సూటయింది. పాత్రకు తగిన హావభావాలు పలికించాడు. తింగరిదానిలా జెనీలియా చేసిన చేష్టలు శృతిమించాయనే చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. పప్పీ పాత్రలో బ్రహ్మానందం చేసిన ప్రయత్నాలకు గిలిగింతలు పెట్టుకోవాలి. ప్రకాష్‌రాజ్‌, రఘు, మంజుల ....పాత్రలు కథకు తగ్గట్టు అమరాయి. వెన్నెల కిషోర్‌ నుంచి పెద్దగా కామెడీ లభించలేదు. టెక్నికల్‌గా ఉపయోగించేందుకు సన్నివశాలు లేవు.
మంచి లొకేషన్లు దొరికితే కెమరామన్‌కు పండుగే. దాంతో సాధ్యమైనంత వరకూ భూమీ, ఆకాశం, నీరు...ఇలా దేన్నీ విడిచిపెట్టకుండా రామ్‌ ప్రతిభా పాటవాల కోసం అన్నిటినీ ఉపయోగించారు. కథలో పసలేక పోవడం ఒకెత్తయితే, సంబంధంలేని సన్నివేశాలు ఒకెత్తు దీంతో నీరసించడం ప్రేక్షకుడి వంతు. మొత్తంగా దర్శకనిర్మాతలది వృథా ప్రయాసగానే కనిపిస్తుంది....

హరీష్‌జైరాజ్‌ సంగీతం సో...సో... అనిపించింది. 'సముద్రమంత ప్రేమను పొందడం చాలా కష్టం. అది జరగాలంటే...ఒకమ్మాయినే ప్రేమించాలి' అని రామ్‌కు మంచి మాటలు చెప్పే వ్యక్తిగా, దిశానిర్దేశం చేసే పెద్దమనిషిగా నాగబాబు కన్పిస్తాడు. మొదటి భాగం అంతా గందరగోళంగా ఉంది. సింపుల్‌గా ఇదో పిచ్చి కథ అని ప్రేక్షకుడు వాపోతాడు. ఈ పిచ్చి వేషాలకు కారణాలను రెండో అర్థభాగంలో చూపాడు....

రివ్యూ నచ్చినవాళ్ళు కామెంట్ చేయచ్చు నచ్చని వాళ్ళు నా బ్లాగ్ నుంచి దొబ్బెయచ్చు.....ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ అని సరిపెట్టుకుంటా....

1 comment:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఫస్ట్ హాఫ్ చూసి హాల్లోంచి వచ్చేసి సెకండ్ హాఫ్ కథని ఎవరితో అయినా రెండు ముక్కల్లో చెప్పించుకొని వింటే మర్యాదగా ఉంటుంది.