పరిశ్రమలో ఒక్క హిట్టు సినిమా ఇచ్చి 10 సినిమాల వరకు జోరు కొనసాగించు కోవచ్చు అనే హీరోలకి చెంప పెట్టులాంటి నిదర్శనమిది. ‘మగధీర’ లాంటి మహత్తర విజయం తర్వాత రామ్ చరణ్ కెరీర్ కి ఢోకా లేదనుకొన్న యావత్ సినీ అభిమానులకి ‘ఆరెంజ్’ చిత్రం మన హీరోగారి అసలు రేంజ్ ఏంటో కరెక్ట్ గా చూపించింది. ధరణి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెరుపు’ చిత్రానికి నిర్మాతలైన పరాస్ జైన్, ప్రసాద్ గార్లు ‘ఆరెంజ్’ దెబ్బకి రామ్ చరణ్ ఒంటరిగా ఓసాదాసీదా చిత్రాన్ని మోసేంత పరిణితి ఇమేజ్ సాధించలేదన్న సత్యాన్ని గ్రహించి బెంబేలెత్తి పోయారట. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తమ ‘మెరుపు’ చిత్రానికి వన్నెలు అద్దే పనిలో భాగంగా నానా పటేకర్ ని గానీ, తమిళ సూపర్ స్టార్ అర్జున్ ని గానీ ముఖ్య పాత్ర ద్వారా చిత్రంలో ప్రవేశపెట్టి చరణ్ ఇమేజ్ కి డేమేజ్ లేకుండా తమ పని తాము కానిచ్చేసుకోవాలన్న పనిలో పడ్డారట ఈ తెలివైన నిర్మాతలు.
1 comment:
one more stupid post from you.
Don't spread false new about orange and charan. Charan acted very well and orange movie concept is ture and worth to watch.
Movie hit or flop will not decide the hero sucess or failure.
write some good articles that would be helpful to all.
Don't waste your time if you have free time then flick the cat hair.
Post a Comment