‘ఆరెంజ్’ సినిమాకి ఎక్స్ ట్రా పేమెంట్ కావాలంటూ జెనీలియా, ఆమె తల్లి తనని బ్లాక్ మెయిల్ చేశారని, చేసేదిలేక వారు అడిగింది ఇచ్చి సినిమా పూర్తి చేసుకున్నాని నాగబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రత్యక్షంగా స్పందించని జెనీలియా ట్విట్టర్ లో మాత్రం పరోక్షంగా బదులిచ్చింది. నిజాలెప్పుడూ నిలకడమీదే తెలుస్తాయని, అబద్దాలకి త్వరగా ప్రచారం దొరుకుతుందని, కానీ నిజం తప్పకుండా బయటకొస్తుందని ఆమె రాసుకుంది. అంతే కాకుండా నాగబాబుని గురించేనా అంటూ అడిగిన వాళ్లతో అతను తన గురించి చాలా అన్యాయంగా మాట్లాడాడని, అసలు జరిగిన సంగతి వేరే ఉందని, తప్పకుండా ఏదో ఒక రోజు ఆ విషయం బయటపెట్టి అతడిని కడిగేస్తానంటూ జెనీలియా చెప్పుకొచ్చింది.
అయితే షూటింగ్ లేట్ చేసి కూడా ఎక్స్ ట్రా డేట్స్ కి డబ్బులివ్వడం గురించి నాగబాబు అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకున్నాడని, అసలు అందులో జెనీలియా తప్పేమీ లేదని, న్యాయంగా తనకు రావాల్సింది తీసుకుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో నిజానిజాలు ఎన్నిఉన్నాయో, ఆరెంజ్ స్టోరి ఎలా సుఖాంతం అవుతుందో వేచి చూడాల్సిందే.

No comments:
Post a Comment