Wednesday, December 8, 2010

భార్య సలహాపైనే మహేష్ బాబు ఆ సినిమా కాదన్నాడా?



మహేష్ బాబు "త్రీ ఇడియట్స్" రీమేక్ లో చేయనని శంకర్ కి చెప్పేసాడని అంతటా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ ఈ నిర్ణయిం తీసుకోవటానకి వెనక ఆయన భార్య నమ్రత సలహా ఉందని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇంతకీ ఆమె సలహా ఏమిటంటే..ఇప్పటకే తెలుగులో చాలా మంది త్రీ ఇడియట్స్ హిందీ వెర్షన్ ను చూసేసారు. అందుకే అది అంత పెద్ద హిట్టయింది. సినిమాకు మార్కెట్ అయిన చిన్న చిన్న టౌన్ లలో కూడా త్రీ ఇడియట్స్ విడుదలైంది. ఇంలాంటి సిట్యువేషన్ లో తెలుసున్న కథను మళ్ళీ తెరపై చూడటానకి ఎవరు వస్తారు అని ఆమె నిలదీసిందని చెప్తున్నారు. అలాగే తమిళ హీరో విజయ్ కూడా ఇదంతా ఆలోచించే ఈ ప్రాజెక్టునుండి తప్పుకున్నాడు కాబట్టి మీరూ తప్పుకోవటం బెస్ట్ అని చెప్పిందిట. ఇక ఇంతకాలం రీమేక్ లు చేయకుండా వస్తూ..ఇప్పుడీ పాపులర్ చిత్రం రీమేక్ చేయటం వల్ల ఒరిగేదేమీ ఉండదని చెప్పిందని, ఇదే విషయం మహేష్ సన్నిహితులు కొందరి వద్ద కూడా ఆమె అందని తెలుస్తోంది. అందుకే మహేష్ ఈ చిత్రం చేయనన్నాడని అంటున్నారు. అయితే తమిళ, తెలుగు భాషల్లో రూపొందే ఈ చిత్రంలో తమిళ నటులును ఎక్కువ మంది ఉండటంతో వారితో పనిచేయాల్సి రావంట మహేష్ కు ఇష్టం లేదని అందుకే తప్పుకున్నాడని మరో టాక్ వినపిస్తోంది..అలాగే శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న దూకుడుకి డేట్స్ ప్లాబ్లం వస్తుందని ఈ రీమేక్ ని రిజెక్టు చేసాడని చెప్తున్నారు.

3 comments:

Admin said...

bagundi.

Anonymous said...

keka decision..

astrojoyd said...

VERY NICE LOGICAL ND WISE ACT....