త్వరలో షారుఖ్ సాబ్ ‘జోర్ కా జట్కా’ అనే రియాలిటీ షో నిర్వహించడానికి రెడీ అవుతున్నాడు. ఇందునిమిత్తం ఆయన వసూలు చేస్తున్న రెమ్యునేషన్ వింటే కళ్ళు తిరుగుతాయి. ఎపిసోడ్ కి రెండున్నర కోట్లు. మొత్తం 16 ఎపిసోడ్స్ కి కానూ ఆయన 40 కోట్లు వసూలు చేస్తారు. ఇంత మొత్తంలో టీవీ షోకి రెమ్యునేషన్ తీసుకోవడం ఇదే రికార్డ్. ఈ సందర్భంగా షూరూఖ్ మాట్లాడుతూ...'మై నేమ్ ఈజ్ ఖాన్' అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో కొంత డిప్రెషన్ కి లోనయ్యాను. మరో ప్రక్క ఈ మధ్య నాకు తగిలిన ఓ గాయం వల్ల అనారోగ్యం పాలయ్యాను. ఈ నేపథ్యంలో నాకు లభించిన టీవీ అవకాశం నన్నంతో ఆనందంలో ముంచేసింది అన్నారు. ‘వైప్ అవుట్’ అన్న విదేశీ టీవీ కార్యక్రమానికి మన దేశ పరిస్థితుల కనుగుణంగా ‘జోర్ కా జట్కా’ని రూపొందించారు. 28 మంది అభ్యర్థులు పాల్గొనే ఆసక్తిదాయక కార్యక్రమం ఇది. ‘ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమిస్తూ పాల్గొనే వారు చేసే విన్యాసాలూ వగైరా చూపరుల్ని ఉత్కంఠపరుస్తాయి. వినోద ప్రధానమైన ఈ షో ‘మస్తీ కా మట్కా..ఫన్ కా ఝట్కా..’ ఎంటర్ టైన్ మెంట్ గా ‘ఛస్కా’ అంటాడు ఖాన్.
No comments:
Post a Comment