Tuesday, January 25, 2011

చిరు 150వ చిత్రానికి రాజకీయ వాతావరణమే అడ్డునా...?

 
 
దాసరి 150వ చిత్రం అంటూ గత సంవత్సరకాలంగా సందడి చేసిన ‘పరమవీర చక్ర’ పూర్తి స్థాయిలో నిరాశపరిచింది. హీరో చిరంజీవి 150వ చిత్రం ఏమవుతుందో అన్న ఆసక్తికర చర్చ మొదలయ్యింది. చిరంజీవి 100వ చిత్రం గర్వంగా చెప్పుకునేవిధంగా రూపొందలేకపోయింది. చిరంజీవితో అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన‘త్రినేత్రుడు’ యావరేజ్ చిత్రంగా మాత్రమే నిలించింది.

మరి 150వ చిత్రమైనా గర్వంగా చెప్పుకునేటట్లుగా రూపొందుతుందా లేదా అన్న సందేహం మెగాభిమానుల మదిలో మెదులుతోంది. రాష్ట్రంలో నెలకుని ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఫిబ్రవరి లో మొదలు కావాల్సిన చిరంజీవి 150వ చిత్రాన్ని నిరవధికంగా వాయిదా వేయడం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథ, కథనాలు, పాటలు సిద్దమైపోయాయని, రాజకీయ వాతారణం కొంచెం సద్దుమణిగాక, షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యమని, ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో 2011లోనే విడుదల చేసే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

No comments: