Sunday, January 23, 2011

రామ్ చరణ్ తో ఆ రీమేక్ చేయాలని చిరంజీవి ఆలోచన

మెగాస్టార్ చిరంజీవి [^] మొన్న సంక్రాంతికి విడుదలై విజయం సాధించిన తమిళ చిత్రం ఆడుకాలం చూసారు. దానిని ఇప్పుడు తన కుమారుడు రామ్ చరణ్ తో రీమేక్ చేయాలని తన వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్లు మెగా క్యాంప్ నుంచి వినపడుతోంది. కోడి పందాల నేపధ్యంలో సాగే ఈ కథ పక్కా మాస్ మశాలాతో యాక్షన్ ఓరియంటేషన్ తో నడుస్తుంది. తన కుమారుడు ఆరెంజ్ లాంటి చిత్రాల్లో నటించే కన్నా చక్కగా మాస్ హీరోగా ఇలాంటి సినిమాలు చేస్తే ఆ క్రేజే వేరుని ఎలాగయినా ఈ చిత్రం చేయంచాలని చూస్తున్నాట్ట.

ఇక అల్లు అరవింద్..అంతగా నచ్చిన ఈ చిత్రం తమ బ్యానర్ పైనే చేద్దామని రైట్స్ కోసం సంప్రదిస్తున్నారని వినికిడి. రామ్ చరణ్ మాత్రం తన చేస్తాను..చెయ్యను అనే విషయం మాత్రం ఇంకా క్లియర్ చేయలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ మెరుపు చిత్రం చేస్తున్నాడు. ధరణి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తాడు.

1 comment:

జయంత్ కుమార్ said...

ippudu vasthunna cinema kuda flop ayithe... veedu valla nannatho kalisi rajakiylokki ravadam better
http://telugutelevisionmedia.blogspot.com/