రామ్ చరణ్ తాజా చిత్రం "మెరుపు" కు ఈ సారి చిరంజీవి దెబ్బ తగిలిందని సమాచారం. ఆరెంజ్ లాగే ఈ చిత్రానికి ఓవర్ బడ్జెట్ అవనుందనే ఎస్టిమేషన్ చూసిన చిరంజీవి సీరియస్ అయి...బడ్జెట్ కంట్రోలు చేసుకోమని దర్శకుడుకి సలాహా ఇఛ్చారట. దాంతో తాను బడ్జెట్ తగ్గించి క్వాలిటీ విషయంలో రాజీ పడలేనని దర్శకుడు ధరణి నిక్కచ్చిగా చేప్పేసాడని సమాచారం. అయినా చిరంజీవి పట్టువిడవక..చరణ్ పై ఎంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందనే లెక్కలను బట్టే చిత్రం చేయమని, ఆరెంజ్ చిత్రంలా మరో సారి జరగకూడదని సీరియస్ గా చెప్పారుట. దాంతో నిర్మాతలు ఏమి చేయాలో అర్దం కాని స్ధితిలో పడ్డారుట. ఈ స్ధితిలో సినిమా ఆగిపోయే అవకాశముందని చెప్తున్నారు. అయితే ఇటీవల చరణ్ తవ ట్విట్టర్ లో మెరుపు షూటింగ్ జనవరి మూడో వారంలో మొదలవుతుందని మెస్సేజ్ ను ట్వీట్ చేసారు. కానీ అదేమీ జరగలేదు. గత సంవత్సరం ఏప్రిల్ 30న ప్రారంభమైన మెరుపు ఓ పాటను, కొంత టాకీని కూడా పూర్తి చేసుకుంది. మరో ప్రక్కఈ చిత్రం స్క్రిప్టు కూడా సరిగా లేదని, మార్పులు చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే హీరోయిన్ గా చేస్తున్న కాజల్ ప్రాజెక్టు నుండి ప్రక్కకు తప్పుకుంది. మరో హీరోయిన్ ఇప్పటివరకూ ఎంపికకాలేదు. బడ్జెట్ గొడవ తేలి, హీరోయిన్ ఎవరో తేలితేనే ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది. కానీ పరిస్ధితి చూస్తూంటే ఆ వాతావరణం కనపడటం లేదంటున్నారు.
No comments:
Post a Comment