Wednesday, February 16, 2011

పవన్ కళ్యాణ్ తెలంగాణాలో క్లిక్ అవ్వాలంట్ మెగా స్కెచ్ వేయాల్సిందే..!?



ఆమధ్య తన ‘కొమరం పులి’ తెలంగాణావాదుల దెబ్బకు కొమరాన్ని పీకేయించుకుని కోరల్లేని పులిలా మిగిలిపోయి భారీ నష్టాన్నే చవిచూడటంతో ముందు చూపులెక్కువయ్యాయి పవన్ కళ్యాణ్ కి. ఇప్పటికే తన లవ్లీ టైటిల్ ని మార్చేసి ‘తీన్ మార్’ అంటూ తెలంగాణాలో తన చిత్రం తెలంగాణా ప్రజల్ని ఆకట్టుకునేలా తీర్చి దిద్దుతుంటే..మరోవైపు తాజాగా తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ద్వారా ప్రారంభిస్తున్న ‘గబ్బర్ సింగ్’ లో తనకి తమ్ముడిగా నితిన్ ని తీసుకోవటం వెనక కూడా వ్యూహముందనిపిస్తోంది. ఇటీవలే విడుదలైన తెలంగాణా చిత్రంలో కనీసం ఓ చిన్న పాత్ర కూడా దక్కని తెలంగాణా ‘మెగా స్టార్’నితిన్ ని ఎంపిక చేయటం తాను తెలంగాణాకు వ్యతిరేకం కాదని చెప్పేందుకే.

ఇక ముందు ఉద్యమజ్ఝలెన్నొచ్చినా..తెలంగాణాలో తన సినిమాలకి ఇబ్బందులుండకుండా చూసుకోవటమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మున్ముందు ఇంకెన్ని ప్లానులేస్తాడో మన పవర్ స్టార్. అలాగే వరుస ప్లాపుల హ్యాట్రిక్స్ మూట కట్టుకున్న నితిన్ ఇలా చిన్నా చితక పాత్రల్లోకి మారిపోవటమా? మరిన్ని ఛాన్సులు మూటకట్టుకోవటమా అన్నది కూడా తేలిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.

No comments: