Monday, February 14, 2011

హీరోయిన్ ను గుండు కొట్టించుకొంటేనే ఛాన్స్ ఇస్తానన్న డైరెక్టర్...



ఒకప్పుడు కథానాయికగా చేసిన నదియా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తోంది. రీసెంట్ గా తమిళ చిత్రం ‘తమిరభరణి’ రీమేక్ గా తెలుగులో ‘భరణి’ చిత్రంలో విశాల్ హీరోగా హీరోయిన్ సంద కి తల్లి పాత్ర పోషించి సినిమాకి హైలెట్ గా నిలిచింది. కాగా కొన్ని సవంత్సరాల తర్వాత తమిళ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో ఓ సినిమాకి లీడ్ రోల్ చేయడానికి ఛాన్స్ వచ్చింది నదియాకి. మిస్కిన్ మంచి దర్శకుడు కాబట్టి ఈ ఆఫర్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట నదియా. కానీ ముందు పాత్ర గురించి వినమని..ఈ పాత్ర కోసం మీరు గుండు కొట్టించుకోవాలని నదియాతో మిస్కిన్ అనగానే ఆమె అదిరిపడిందట. గుండు చేయించుకోను..కావాలంటే విగ్ పెట్టుకుంటానని నదియా చెప్పడంతో గుండు కొట్టించుకోవడానికి రెడీ అయితే చాన్స్ ఇస్తా లేకపోతే లేదని ఖరాకండిగా మిస్కిన్ చెప్పాడని వినికిడి.

No comments: