Friday, February 18, 2011

బ్యాటింగ్అయిపోయాక.....అవసరసరం తీరిపోయింది అని స్టార్ హీరోయిన్ నీ వదిలేసిన క్రికెటర ధోనీ, శ్రీశాంత్



కోలీవుడ్ అందాల భామ లక్ష్మీరాయ్ గతంలో క్రికెటర ధోనీతో ఎఫైర్ నడుపుతోందంటూ వార్తల్లోకి వచ్చింది. ఆతర్వాత మరో క్రికెటర్ శ్రీశాంత్‌తో రోమాన్స్ చేస్తుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇవన్నీ లక్ష్మీరాయ్ పబ్లిసిటీ కోసం కావాలనే సృష్టించినటువంటి గాసిప్స్ అంటూ ఇండస్ట్రీ కొట్టపారేసింది. ఈసందర్బంలో లక్ష్మీరాయ్ మాట్లాడుతూ ధోనీతో తనకు మంచి స్నేహాం ఉందనీ, శ్రీశాంత్ తనకు వీరాభిమాని అంటూ తెగ హాడావుడి చేస్తూనే ఉంది. ఈహాడావుడి అంతా ఎందుకు అంటే ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్నటువంటి వరల్డ్ కప్ పోటీలను స్వయంగా తిలకించేందుకని సన్నిహితుల సమాచారం.

ఈ విషయంపై మన అమ్మడు లక్ష్మీరాయ్ కూడా ధోనీ, శ్రీశాంత్‌లతో సంప్రదింపులు జరిపిందని సమాచారం. ఐతే ఈవిషయంపై వీరిద్దరూ చూద్దాంలే అని అన్నారే గానీ వాళ్శ తరుపున గ్యాలరీ‌లో చోటు కల్పించేందుకు మాత్రం ఆశక్తి చూపడంలేదంట. దాంతో కోపంలో లక్ష్మీరాయ్ వాళ్శిద్దరూ నన్ను వాడుకోని వదిలేశారు. ఇంతటితో మా మద్య ఉన్నటువంటి స్నేహాం చెడిపోయిందని అక్కడున్న వారందరితో చెబుకుంటుందంట. ఐతే ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉందని అభిమానులు అంటున్నారు.

ఇది ఇలా ఉంటే గతంలో లక్ష్మీరాయ్ తెలుగులో శ్రీకాంత్ సరసన కాంచనమాల కేబుల్ టివి అనే సినిమాలో నటించడం జరిగింది. ఈసినిమా ప్లాప్ అవ్వడంతో ఆమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సినిమాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న కీర్తి కంబైన్స్ చిత్రంలో బాలకృష్ణ స్వయంగా లక్ష్మీరాయ్‌ని రికమెండ్ చేయడం జరిగింది. ఈసినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకి దర్శకత్వం పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి మురళి గతంలో ఆంద్రుడు, రెచ్చిపో లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

No comments: