ఇంకెన్నాళ్లు దాస్తారు, అందుకే విచ్చలవిడిగా విజృంభించేశారు....మహారాష్ట్ర సి.ఏం. కొడుకుతో తిరుగుతున్న టాలీవుడ్ అగ్ర కధానాయక.
‘ఇంకెన్నాళ్లు దాస్తారు. అందుకే విజృంభించేశారు’. జెనీలియా, రితీష్ దేశ్‌ముఖ్ గురించి బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్న మాటలివి. గత ఎనిమిదేళ్లుగా ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ జెన్నీ, రితీష ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో అసలు మేమిద్దరం స్నేహితులు కూడా కాదనే టైపులో మాట్లాడారు. అయితే ఆ మాటలను ఎవరూ నమ్మలేదు. జెన్నీ, రితీష్ మధ్య ‘ఏదోఉంది’ అనుకున్నారు. ఆ ఊహ ఇటీవల బలపడింది. విషయంలోకి వస్తే...అక్షయ్‌కుమార్, ట్వింకిల్‌ఖన్నా ఇటీవల తమ పదవ పెళ్లిరోజు ఇటీవల ను ఘనంగా జరుపుకున్నారు. ఆ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో జెన్నీ, రితీష్‌లు కూడా ఉన్నారు. ఆ పార్టీలో వేరే స్నేహితులతో కలవకుండా ఈ ఇద్దరూ కబుర్లాడుకున్నారట. అది మాత్రమే కాకుండా, చేతిలో చెయ్యేసుకుని ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ డాన్స్ కూడా చేశారట. జెన్నీ, రితీష్ బహిరంగంగా ఈ విధంగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఇప్పటివరకు ఎవరి కంటా కనపడకుండా తిరిగిన వీరిద్దరూ హఠాత్తుగా పబ్లిక్‌గా ఇలా ప్రవర్తించడం ఏదో తెగింపు కూడా కనిపిస్తోందని, వీరి వాటం చూస్తే ప్రేమ వ్యవహారాన్ని పెళ్లివరకు తీసుకెళ్లేట్టు ఉన్నారని కూడా బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకున్నాయి. ఇక అక్షయ్, ట్వింకిల్ ఇచ్చిన పార్టీ విషయానికొస్తే రుచికరమైన వంటకాలు, ఖరీదుగల మద్యంతో అతిథులకు ఓ రేంజ్‌లో మర్యాదలు జరిపారు. మరో పదేళ్లయినా, మేమిద్దరం ఇలాగే అన్యోన్యంగా ఉంటామని ఈ సందర్భంగా అక్షయ్, ట్వింకిల్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment