Monday, February 14, 2011

Twitter పరువు తీస్తున్న తెలుగు తారలు......


Twitter ఈ పేరు తెలియని నటినటులు ఉండరు. ఈ మధ్య మరీను సైడ్ ఆర్టిస్ట్ నుంచి సెక్సీ తార వరకు అందరు ఎకౌంటు ఓపెన్ చేసేస్తున్నారు. ఇక తెలుగు సినిమా వైపు వస్తే మరి దారుణం పని పాట లేని హీరో హీరోయిన్స్ కూడా 24 గంటలు దాని మీదే పని. Twitter  కనిపెట్టిన వాడి పరువు తీసేస్తున్నారు కొంత మంది సినీ  ప్రబుద్దులు. 

హీరోలు సంగతి పక్క పెడితే చిట్టి పొట్టి పాపాలు.....అదేనండి హీరోయిన్స్ మరి దారుణం...."ఒకర్తి ఇప్పుడే లేచాను....బాత్రూం కీ వెళ్తున్న అని ట్వీట్....ఇంకోర్తి ఇంకో అడుగు ముందువేసి ఒక అబ్బాయి బలే ఉన్నాడు వెళ్లి హాగ్ చేసుకుని పడుకోవాలి అనిపించింది అని వాగుడు...... మరో పాప అయతే ఏకంగా కుక్క ఎరిగింది......ఏడిచింది.....పిల్లి పిత్తలేదు అని నానా అడ్డమయిన చెత్త విషయాల్ని అన్ని ఏదో  గొప్ప సంగతుల్ల చెప్పేస్తున్నారు.

మళ్ళ చివర్లో "Love You Tweets " అంట ఏదో  వీళ్ళు tweets జనం పడిచచ్చిపోతునట్టు. నిజం చెప్పలింటే వాళ్ళ  పిచ్చి వేషాల్ని ఒక్కడు పట్టించుకోడు....పట్టించుకుంటే ఫిలిం వెబ్ సైట్స్ చూస్తాయి ఎక్కడ డబల్ మీనింగ్ వెతికి న్యూస్ రాసుకుందాం అని.

హీరో కానీ హీరోయిన్ కానీ ట్వీట్ చేస్తే కనీసం తొంగి చూస్తాం...వెళ్ళే ఎక్కువ అనుకుంటే మళ్ళ వాళ్ళ అమ్మ....అక్క...పెళ్ళాం  కూడా ఎకౌంటు ఓపెన్ చేసేస్తున్నారు.....మళ్ళ దానికి వాళ్ళు పెట్టిన పేరు మీ అందరి అభిమానం తో మేము వచ్చేసాం అంట......ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు ఇదే కాబోలు.

No comments: