Saturday, March 12, 2011

తెలుగు హీరోలను ఉద్దేశించి జెనీలియా స్ట్రైయిట్ కామెంట్స్


సినీ పరిశ్రమలో హీరోల బాగా ఆధిపత్యం ఎక్కువ.వారికి అనుకూలంగా ఇక్కడ అన్ని శాఖలూ నడుస్తాయి.హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు గానీ, హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు, సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయి అంటూ డైరక్ట్ గా కామెంట్ చేసింది జెనీలియా.ప్రస్తుతం జెనీలియాను తెలుగులో ఏ హీరోకూడా తమ ప్రక్కన చేయటానికి రికమెండ్ చెయ్యటం లేదు.అలాగే ఆసక్తి చూపటం లేదు. అందులోనూ ఆమె నటించిన రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పుడు ఆ వైఫల్యం వివరిస్తూ..అందులో ఆమె పాత్ర కూడా ఉందని నాగబాబు డైరక్ట్ గా స్టేజిపై చెప్పినప్పుటి నుంచి ఆమెకు తెలుగులో ఆఫర్స్ రావటం లేదు.అందులోనూ ఆమెకు గ్లామర్ రోల్స్ ఇవ్వటానకి దర్శకులు ఎవ్వరూ ఆసక్తి చూపటం లేదు.బబ్లీ,బబ్లీగా ఉండే పాత్రలకు కొత్త అమ్మాయిలనే ఎంపికచేసుకుంటున్నారు.వారైతే వీలైన మేరకు ఎక్సపోజింగ్ చేయటమే కాక పేమెంట్ విషయంలోనూ చాలా తక్కువకి చేయించుకోవచ్చనేది తెలుగు దర్శక,నిర్మాతల ఆలోచన.దానికి తగినట్లే హీరోలు కూడా ఎప్పుడూ తమ ప్రక్కన ప్రెష్ గా ఉండే పేస్ లనే ఎంపికచేసుకోవటానకి ఇష్టపడుతున్నారు.దాంతో ఆమె ఇలా డైరక్ట్ గా బయిటపడింది.

No comments: