ముంబాయిలో వుంటూ హిందీ సినిమాలు చేసుకుంటూ వుండే రామ్ గోపాల్ వర్మ ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకలు మీద విరుచుకుపడ్డాడు. సినిమాలతోనే కాకుండా, తన వ్యాఖ్యలతో టివి ప్రేక్షకుల్ని సైతం విసిగించాడు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఓ శుభవార్త. అదేమిటంటే దొంగలముఠా రిలీజ్ అయిన వెంటనే ముంబాయి వెళ్లిపోతున్నాడట.
ఎక్కువగా ముంబాయిలోనే వుండే మీరు ఈ మధ్య హైదరాబాద్ లోనే తిష్ట వేశారు అని అడిగితే ‘దొంగలముఠా’ రిలీజ్ అయింది కదా. ముంబాయి వెళ్లబోతున్నాను. కేనన్ 5డి కెమెరాతో అక్కడ కూడా ఓ సినిమా చేయ్యడానికి వెళ్తున్నాను. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ లతో ‘త్రిశంక్’ అనే సినిమా చెయ్యబోతున్నాను. అయితే ఇది దొంగలముఠాలాగ 5 రోజుల్లో అయిపోయే సినిమా కాదు. దీనికి సిజి వర్క్ చాలా వుంటుంది. కాబట్టి నాలుగైదు నెలలు పడుతుంది’ అంటున్నాడు. ఏదిఏమైనా రామ్ గోపాల్ వర్మ పెట్టే బేడా సర్థుకుంటున్నాడన్న వార్త తెలుగు ప్రేక్షకులకు, మీడియాకు సంతోషం కలిగించే విషయమే మరి.
English summary
Ace director Ram Gopal Varma is now all set for his next Bollywood film which will be based on the working of the Police Department in the country. At first he named it 'Company 2- The other side'. But now for some unknown reasons the movie has been renamed as 'Trishank'.
1 comment:
బాబ్బాబు మీరు ఎప్పుడు పెట్టె బేడా సర్దేస్తున్నారు. మీ రాతలనుండి మాకు ముక్తి కలిగించరూ, ప్లీజ్.
Post a Comment