Thursday, March 17, 2011

త్రిష గొంతెమ్మ కోర్కెలు.. తీరుతాయా... పెడతాయా..?!!







బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కతోపు తోయడంతో బక్కపలచని భామ త్రిష ప్రస్తుతం గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూచుని ఉన్నట్లు కోలీవుడ్ సినీజనం అంటున్నారు. చాన్నాళ్ల తర్వాత ఇలా గ్యాప్ రావడంతో ఏదో ఒకటి చేయాలని త్రిష ప్రణాళికలు వేస్తోందట.

వెనకటికి ఎవరో అన్నట్లు తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరుకోవన్నట్లు రానున్న దీపావళి సందర్భంగా చుట్టాలు, పక్కాలనందరినీ పిలిచి కాకరొత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు కాల్చాలని ప్లాన్ చేసిందట.

అంతేకాదండోయ్.. ఈమెకు చిన్నచిన్న ఆశలు కూడా ఉన్నాయట. రజినీకాంత్ సరసన చిన్న పాత్రలోనైనా నటించాలన్న కోరిక ఎక్కడో ఓ మూలన దాగి ఉందట. చెన్నై సెంట్రల్ ప్రక్కనే ఉన్న కూవమ్ కాలువ(ప్రస్తుతం అది ఓ మురికి కూపం)లో ఈత( శుభ్రం చేసిన తర్వాత) కొట్టాలని ఎంతో ఆశ పడుతోందట.

ఇంకా ఛాన్స్ వస్తే తిరిగి టీనేజ్‌కు వెళ్లి కాలేజీలో చదువుకోవాలన్న కోరిక ఎంతో బలంగా ఉన్నదట. ఈ గొంతెమ్మ కోరికలు తీరుతాయా..? పెడతాయా...? అయినా అదో తుత్తి..!!

No comments: