నటి రమ్యపై కర్ణాటకలోని సినీ నిర్మాతలు ఏడాది పాటు నిషేధం విధించారు. నిర్మాత ఎ. గణేష్‌తో గొడవలే అందుకు కారణం. ఏడాదిపాటు రమ్యను సినిమాల్లోకి తీసుకోవద్దని కర్ణాటక ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఆదేశించింది. దండం దశగుణం సినిమా నిర్మాత గణేష్‌తో వివాదం తలెత్తడంతో తాు సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటానని రమ్య అంతకు ముందు ప్రకటించింది. దండం దశగుణం సినిమా నిర్మాణం ఇటీవలే పూర్తయింది.
తన నుంచి గణేష్ 9 లక్షల రూపాయల తీసుకుని తిరిగి ఇవ్వలేదని రమ్య బహిరంగంగా విమర్శించింది. చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా ఆమె బహిష్కరించింది. అయితే, నిర్మాత మునిరత్న మాత్రం రమ్యకు అండగా నిలిచాడు. అందరు నిర్మాతలు రమ్యపై విధించిన నిషేధాన్ని అంగీకరించబోరని ఆయన ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో అన్నారు.

English summary
Film producers in Karnataka have slapped a year-long ban on actressRamya , following her rift with producer A Ganesh . The Karnataka Film Chamber of Commerce (KFCC) has decided not to sign Ramya for any movie for one year.
No comments:
Post a Comment