పవన్ కళ్యాణ్ కండలు చూపించుకుంటూ తిరగక్కర్లేదు..కత్తులు పట్టుకుని పరుగులూ పెట్టక్కర్లేదు..గాల్లో గిరిగిరాలు తిరగి ఫెట్లూ చెయ్యక్కర్లేదు..నేలమీద గిరగిరా తిరిగేసే డ్యాన్సూలూ వెయ్యక్కర్లేదు..ఓ మంచి లవ్ స్టోరి చేస్తే చాలు..ఓ మోస్తరుగా ఎంటర్ టైన్ చేస్తే చాలు. కొన్ని మంచి డైలాగ్స్ చెబితే చాలు. కొంచెం స్టైలిష్ గా కనిపిస్తే చాలు’అంటూ ఎన్నాళ్ళగానో అభిమానులు చెబుతోన్న మాటలకూ, సగటు ప్రేక్షకులూ సమర్ధించిన ఆ వ్యాఖ్యలకు ఇప్పుడు ‘తీన్ మార్’ రూపంలో తిరుగులేని సమాధానాన్ని తెరపైకి తీసుకొచ్చాడు పవన్.
నిజంగానే ఇది సోకాల్డ్ కమర్షియల్ సినిమాల కోవలోకి చేరే చిత్రం కాదు. బట్ ఆడియెన్స్ కి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ కి లోటే రాదు. అలాగే ఇది ఎ సెంటర్స్ కే తప్ప, బి, సి సెంటర్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా కాదు. బీట్ బీసి కాలం నాటి కథలు బోరు కొట్టేసిన వారందరికీ ఇది నచ్చుతుందనడంలో డౌటే లేదు. ఇక రెండు పాత్రలతో..రెండు ప్రేమకథలతో తన ఫ్యాన్స్ ‘తీన్ మార్’ ఆడేలా పవర్ స్టార్ చేసిన ఆ మ్యాజిక్ ఏంటంటే.. ‘తీన్ మార్’ సినిమాలో త్రిషతో పవన్ కల్యాణ్ లిప్ లాక్ కిస్ చేశాడంటూ రిలీజ్ కి ముందు వచ్చిన వార్తల్ని చాలా మంది నమ్మలేదు. పవన్ కల్యాణ్ అలాంటి పని చేస్తాడంటే ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే, మామూలుగా పవన్ అటువంటి వాటికి దూరంగా ఉంటాడు కాబట్టి. ఇంత వరకు ఎప్పుడూ తన సినిమాల్లో అలాంటి వాటిని తను ఎంకరేజ్ చేయలేదు.
అయితే, వార్తలొచ్చినట్టుగానే ఇందులో పవన్ మూడు ముద్దు సీన్లు చేశాడు. వాటిలో ఒక లిప్ లాక్ కిస్ ని రమ్యంగా షూట్ చేశారు. పొతే, చాలా భారీ అంచనాలతో నెంబరాఫ్ స్క్రీన్స్ మీద రిలీజ్ అయిన ఈ సినిమాకి ఓవరాల్ గా పాజిటివ్ రిపోర్టే వస్తోంది. ముఖ్యంగా క్లాస్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చినట్టు చెబుతున్నారు. మరి, మాస్ ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి..!
English summary
The summer season has begun so it is obvious that this is the time for big cinema bonanza. Now that the much talked about Shakti has flopped, all eyes have turned towards Teen Maar. The people who had seen Love Aaj Kal need to tame their expectations and the urbane crowds who haven’t seen LAK might find this movie entertaining. We have to wait and see if Pawan Kalyan is going to repeat the magic of Jalsa at the box office or not.
No comments:
Post a Comment