ఇలియానా త్వరలో మందాకిని గా బాలీవుడ్ తెరపై కన్పించనుందంటూ గత రెండు రోజులుగా మీడియాలో హోరెత్తి పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె మందాకిని గా చేయబోతోందంటూ చెప్పుతున్న సినిమా వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై-2 డైరక్టర్ మాత్రం అస్సలు ఇలియానా ఎవరో తనకు తెలియదంటూ షాక్ ఇచ్చాడు. ఆమె పేరే ఇంతకు ముందు నేను ఎప్పుడూ వినలేదు. ఇంకా మా సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. ఎప్పుడయితే ఆ పాత్రకు ఎవరని తీసుకోవాలనేది ఫైనలైజ్ అవుతుందో అప్పుడు నేనే మీడియాకు చెప్తాను అన్నాడు. ఇక ముంబయ్ అండర్ వరల్డ్ నేపథ్యంలో ఇటీవల ఏక్తాకపూర్ నిర్మించిన ‘ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయ్’లో దావూద్ ఇబ్రహీం పాత్రను ఇమ్రన్ హష్మి చేయగా.. మందాకిని పాత్రను ఎమీ కింగ్స్టన్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని ఏక్తాకపూర్ అనుకుంటున్నారు. ఈలోగా ఇలియానాపై ఈ రూమర్ పుట్టించేసి ఆమె పరువు తీసేసారు.
No comments:
Post a Comment