Thursday, May 19, 2011

హీరోలందరికీ పెళ్ళిళ్లు అయిపోవాలి: ప్రియమణి

టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి మదిలో ఒక కోర్కె ఏర్పడింది. టాలీవుడ్‌లోని హీరోలందరికీ పెళ్లిళ్లు అయిపోవాలి కోరుకోంటోది. హీరోలందరకీ త్వరగా పెళ్లిళ్లు అయిపోతే హీరోయిన్లపై వచ్చే గ్యాసిప్స్ తగ్గిపోతాయని, తద్వారా హాయిగా తమ పని హాయిగా చేసుకోవచ్చని చెప్పుకొచ్చింది.

ఇటీవల పెళ్ళిళ్లయిన అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ల వివాహ వేడుకలకు హాజరైన ఆమె సరికొత్తగా పెళ్లికొడుకుగా ముస్తాబవుబోతున్న కార్తీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రియమణి ఇలా వ్యాఖ్యానించింది. కోలీవుడ్‌లో ఇప్పటికే కార్తీ ప్రియమణిలపై అనేక గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి.

ఈ గాసిప్స్‌కి గేటు వేయడానికి ప్రియమణి ఈ సరికొత్త రాగాలు తీస్తోందని తెలుస్తోంది. హీరోలకు పెళ్లయినా గానీ గాసిప్స్‌కేం కొదవా ఉండదని మరికొందరు హీరోయిన్లు ఆమెకు కౌంటర్‌గా చెప్పడం కొసమెరుపు. నిప్పులేనిదే పొగరాదంటున్నారు మరికొంతమంది హీరోయిన్లు చెప్పారు.

No comments: