Friday, July 15, 2011
సన్నబడి రీఎంట్రీ ఇస్తానంటోంది
మహేష్ బాబుతో మురారి, చిరంజీవితో ఇంద్ర చిత్రాలు చేసిన సోనాలి బింద్రే తెలుగులో ఒకానొక టైమ్ లో బిజీ హీరోయిన్. అయితే ఆ తర్వాత పెళ్ళి చేసుకుని సినిమాలకు దూరమైంది. అలాగే ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే కొడుకు స్కూల్ కి వెళ్ళి పోవటంతో ఆమె ఖాళీ అయిపోయింది. దాంతో ఆమెకు మళ్ళీ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వాలనే కోరిక మొదలైంది.అయితే ఇప్పుడామె రూపం మారిపోయింది. చాలా లావుగా తయారైన ఆమెకు స్లిమ్ అయి కనిపించమని పరిచయ దర్శక,నిర్మాతలు సలహా ఇస్తున్నారు. దాంతో ఇప్పుడామె రోజూ జిమ్, ఆహార నియమాలు అంటూ పాత ఫిగర్ తెచ్చుకునే పనిలో పడింది. ఇక ఇప్పటికే ఆమె రెండు తెలుగు సినిమాలు, ఒక హిందీ సినిమా కమిటైనట్లు తెలుస్తోంది.అయితే హీరోయిన్ గా మాత్రం ఆమెను తీసుకుని ఉండరు.ఏ అక్కో,అత్తో రోల్స్ కో ఆమెను అడుగుతారని చెప్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment