Tuesday, July 19, 2011

డైరెక్టర్ కి షరత్తులు పెట్టింది...సినిమా నుండి గెంటేశారు..?





‘జానే తూ యా జానేనా’ తర్వాత బక్కపల్చటి భామ జెనీలియాకు హిందీలో మంచి హిట్ రాలేదు. హిందీలో కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడికి ఇటీవలే బాలీవుడ్‌లో అద్భుతమైన అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. బాలీవుడ్‌లో ఇంతవరకు అగ్ర హీరోల సరసన నటించని ఈ భామకు అభిషేక్ సరసన రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్న ‘బోల్ బచ్చన్’చిత్రంలో నటించే బంపర్ అవకాశం దొరికింది. దీంతో జెనీలియా బ్రహ్మాండమైన ఛాన్స్ కొట్టేసిందని, బాలీవుడ్‌లో ఈ చిత్రం ఆమెకు మంచి బ్రేక్‌నిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే నిర్మాతలతో వచ్చిన వివాదాల కారణంగా చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి జెనీలియాను తప్పించి ప్రాచీ దేశాయ్‌ ని హీరోయిన్‌ గా ఎంపికచేశారు.

టాలీవుడ్ లో తను చేసిన నకరాలు బాలీవుడ్ లో కూడా చేద్దామనుకుని ట్రై చేసిన జెనీలియాకు గట్టిదెబ్బ తగిలింది. అభిషేక్ బచ్చన్ సినిమాలో జెన్నీకి మంచి అవకాశం వచ్చి సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఆమెను ఆ సినిమా లోంచి తీసేశారట. సినిమాలో తన పాత్రను మార్చాలనీ, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనీ జెన్నీ తాజాగా షరతులు విధించిందట. చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి నచ్చచెప్పడానికి ఎంతగా ప్రయత్నించినా ఆమె ఒప్పుకోకపోవడంతో ఇక చేసేది లేక, చివరికి సినిమా నుంచి ఆమెను డ్రాప్ చేశారట. 'షూటింగ్ ప్రారంభం కాకుండానే ఇలా జరగడం ఒక విధంగా మా మంచికే జరిగింది. లేకపోతే ఇబ్బంది అయేది'అంటున్నారు నిర్మాతలు. అయితే, జెన్నీ మాత్రం మరోలా చెబుతోంది. పాత్ర నచ్చక తానే ఆ ప్రాజక్ట్ నుంచి బయటకు వచ్చేశానని చెప్పుకుంటోంది!

No comments: