నాగచైతన్య కీ,కాజల్ కీ మధ్య సీనియార్టీ వార్ జరుగుతోందని వార్తలు వస్తున్న నేపధ్యంలో దడ ఆడియోకు ఆమె అటెండ్ కాకపోవటం చర్చనీయాంశమైంది.నాగచైతన్య హీరోగా అజయ్ భుయాన్ దర్శకత్వంలో రూపొందిన దడ చిత్రం ఆడియో మొన్న రిలీజైంది.ఈ చిత్రం ఆడియోకు కాజల్ హాజరు కాలేదు.దాంతో నాగార్జున ఫ్యాన్స్ అంతా ఆమెపై కోపం పడుతున్నారు.అయితే కాజల్ తాను రాకపోవటానికి సవాలక్ష కారణాలు చెప్పే అవకాశముంది.కానీ ఆడియో పంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అకేషన్ దానికి హాజరు కాకపోవటం ఆమె పొగరుని సూచిస్తోంది అంటున్నారు. ఇంకా ఈ మధ్యన కొందరు హీరోయిన్స్ ఆడియో పంక్షన్స్ లో డాన్స్ లు కూడా చేస్తున్నారు.
అలాంటిదేమీ చేయమనకుండానే కాజల్ హ్యాండ్ ఇవ్వటం యూనిట్ సభ్యులని ఆశ్యర్యపరిచింది.అయితే కాజల్ కీ,నాగచైతన్యకీ షూటింగ్ సమయంలో చిన్న పాటి గొడవలు వచ్చాయని,వాటిని దృష్టిలో పెట్టుకుని ఆమె రాకపోయి ఉండవచ్చు అంటున్నారు.అయితే నాగచైతన్య స్వయంగా పిలచి ఉంటే వచ్చేదని,చైతన్య కూడా పట్టుదలగా ఆమెను ఎవాయిడ్ చేసినట్లుగా చెప్తున్నారు.ఇక మొదటి నుంచీ కూడా కాజల్ తను సీనియర్ నటినని,నాగచైతన్య కేవలం మూడు చిత్రాల నటుడు అన్నట్లుగానే చూసిందని నాగార్జున ఈ విషయమై కోప్పడినట్లు కూడా చెప్పుకుంటున్నారు.కుర్ర చేష్టలుగా పెద్దవాళ్ళు కొట్టిపారేసినా ఇలాంటి పంక్షన్ లకు వస్తే గౌరవం గా ఉండేదని,ఇలాంటి సమయాల్లోనే దాసరి వంటివారు హీరోయిన్స్ అనే మాటలు సబబు అనిపిస్తాయని చెప్తున్నారు.
No comments:
Post a Comment