Thursday, July 7, 2011

దిల్ రాజుకు ఓ రేంజిలో ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత









నైజాం ఏరియాలో దిల్ రాజుకి డిస్ట్రిబ్యూటర్ గా మంచి గ్రిప్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఎంత చెపితే అంత అన్నట్లుగా అక్కడ ధియోటర్స్ ని ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారు. అయితే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ రీసెంట్ గా అక్కడ ఆపీస్ తెరిచి దిల్ రాజుకి ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం. వారు మొదట తమ సినిమా నైజాం,వైజాగ్ రైట్స్ ని దిల్ రాజుకి ఇస్తామని ప్రామిస్ చేసి ఉన్నారు. అయితే ఇప్పుడు వారీకీ,దిల్ రాజుకీ చెడటంతో స్వయంగా ఆర్.ఆర్ వారే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగారు.అందులో బాగంగా ఎన్టీఆర్ ఊసరివిల్లి, నాగార్జున రాజన్న రైట్స్ ని తీసుకున్నారు. వారు మిరకపాయ చిత్రంతోటే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రావటం జరిగింది. సీడెడ్ లోనూ, ఈస్ట్, వెస్ట్ గోదావరిలలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసారు. ఇప్పుడు కేవలం నైజాం డిస్ట్రిబ్యూషన్ కోసమే హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఆఫీస్ తెరిచారు. ఈ విషయం ఇన్నాళ్ళూ ఆ ఏరియాలో కింగ్ గా వెలిగిన దిల్ రాజుకి మింగుడు పడటంలేదని తెలుస్తోంది.

No comments: