Thursday, August 4, 2011

రామ్ చరణ్ కి అవంటే భయం పట్టుకుంది





మొదటి సినిమా చిరుత, రెండో చిత్రం మగధర తో రామ్ చరణ్ కి ఎక్కడలేని స్టార్ డమ్ వచ్చేసింది. అయితే మూడో సినిమా ఆరెంజ్ మాత్రం తిరుగులేని ట్విస్టు ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఎవరన్నా కొద్దిగా వెరైటీ కథ అన్నా, క్లాస్ స్టోరీ అన్నా భయపడిపోతున్నాడు. అలాంటి దర్శకులను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఎఫెక్టు వేద దర్శకుడు క్రిష్ కి దగిలింది.అతనో డిపెరెంట్ సబ్జెక్ట్ తో రామ్ చరణ్ ని కలిస్తే తాను పక్కా మాస్ ఎంటర్టైనర్ అయితేనే చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పాడని టాక్. దాంతో క్రిష్ నిరాశపడ్డాడని,ఆరెంజ్ కు ముందు ఎంతో ఉత్సాహం చూపిన చరణ్ ఇలా జావకారిపోవటానికి కారణం బొమ్మరిల్లు భాస్కర్ అని తిట్టుకున్నాట్ట.

ఇక మెగా సూపర్‌గుడ్‌ పతాకంపై ఎన్వీ ప్రసాద్‌, పారస్‌ జైన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏమైంది ఈ వేళ చిత్రంతో దర్శకుడుగా మారిన సంపత్‌ నంది ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. జూలై 3వ తేదీ నుంచి శ్రీలంకలో హీరో,హీరోయిన్స్ పై పాటను షూట్ చేస్తున్నారు. వందశాతం మాస్‌ చిత్రమిదని,కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్‌ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి.

No comments: