ప్రిన్స్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ ఝలక్ ఇచ్చాడు. ఈ ఆశ్చర్యకర సంఘటనను చూసిన ఓ అసోసియేట్ డైరెక్టర్ తనకు ఎదురైన అనుభవాన్ని దూకుడు సినిమా యూనిట్‌కు చెప్పి వాళ్లను ఆశ్యర్యానికి గురి చేశారు. మహేష్‌బాబు తాజా సినిమా దూకుడులో ‘భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది’ అనే డైలాగ్ బాగా పాపులర్ అవుతోంది. డైలాగ్‌ను బుల్లి మహేష్ బాబు కంఠస్థం పట్టడమే కాదు..సందర్భానుసారంగా వాడేస్తున్నాడు కూడా...
సదరు అసోసియేట్ డైరెక్ట్ మహష్‌బాబు ఇంటికి వెళ్లినప్పడు...గౌతం తన ఇంట్లో కాపలాగా ఉండే కుప్పపిల్లతో ఆడుకుంటూ దాని వెంట పడుతు కనిపించాడట. అదే సమయంలో మహేష్ ఇంట్లో పని చేసే ఓ పనివాడు...గౌతంను పిలిచి ‘బాబు అది కరుస్తుంది వదిలెయ్ భయపడతావు’ అని చెప్పాడట. దీంతో ఆ పనోడి వైపు కోపంగా చూసిన గౌతమ్...‘భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది’ అంటూ ఆ పనోడికి ఝలక్ ఇచ్చాడట. ఈ సీన్ చూసి అవాక్కయిన అసోసియేట్ డైరెక్టర్ యూనిట్ సభ్యులకు చెప్పడంతో లిటిల్ సూపర్ స్టార్ గురించి ఒక్కటే చర్చ.
No comments:
Post a Comment