Monday, August 15, 2011

తమిళ తంబీల చివాట్లు...ప్రియమణి లబోదిబో



ఆ మధ్య వరుస హిట్లతో ఓ వూపు ఊపిన ప్రియమణి పస్తుతం సరైన బ్రేక్ లేక కొట్టుమిట్టాడుతోంది. బికీనీలు వేసి మురిపించినా, వేడిపుట్టించే అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారుకు మత్తెక్కించే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తు‌న్నా...పాపం ప్రియమణిని పట్టించుకునే వారే కరువయ్యారు. ఇలా మళ్లీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను...ఓ పుకారు బాగా ఇబ్బది పెడుతోంది. ఇకపై తమిళ సినిమాల్లో నటించబోనని ప్రియమణి ప్రకటించిందంటూ ఆ పుకారు సారాంశం.

దీంతో చిర్రెత్తిన తమిళ తంబీలు ప్రియమణిని బండబూతులు తిడుతున్నారట. కొందరు తమిళ దర్శకులు నిర్మాతలు ఫోన్ చేసి మరీ ప్రియమణికి క్లాస్ పీకుతున్నారని తెలిలిసింది. దీంతో తేరుకున్న ఆమె...వెంటనే వివరణ ఇచ్చుకోక పోతే కెరీర్ కు భారీ డామేజ్ తప్పదని ఊహించి ఓ ప్రకటన విడుదల చేసింది. నేను ఎప్పుడూ తమిళ పరిశ్రమకు గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించలేదు. త్వరలోనే ఓ పెద్ద ప్రాజెక్టుతో మంచి పాత్రతో వస్తాను. నన్ను ఆదరించి ఈ స్థాయికి తెచ్చింది, జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది ఈ పరిశ్రమే...పుకార్లను నమ్మ వద్దంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది.

ప్రస్తుతం తాను తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్ల తమిళంలో వస్తున్న ఆఫర్లకు సమయాన్ని కేటాయించలేక పోతున్నాను. అంతమాత్రాన తమిళ ప్రేక్షకులకు దూరం అయినట్లు కాదు. నా పరస్థితిని అంతా అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటోంది.

No comments: