Monday, August 22, 2011

‘బెజవాడ రౌడీలు’ దర్శకుడికి క్లాస్ పీకిన నాగ్





కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తూ వారిని ప్రోత్సహించే అగ్రహీరోల్లో అక్కినేని నాగార్జున ముందుంటాడు. రామ్ గోపాల్ వర్మ, వైవిఎస్ చైదరి, లారెన్స్ లాంటి దర్శకులను తెరకు పరిచయం చేసిన ఘనత నాగార్జునదే. డైరెక్టర్ల ఎంపికలో మంచి ముందు చూపు ఉన్న వ్యక్తిగా నాగార్జునకు మంచి పేరుంది.

అయితే ఈ మధ్య నాగార్జున కొత్త దర్శకుల ఎంపికలో విఫలం అవుతున్నారనే వాదన ఎక్కువైంది. తన కుమారుడు నాగ చైతన్య హీరోగా వచ్చిన జోష్, దడ సినిమాలపై నెగెటివ్ టాక్ రావడమే ఇందుకు కారణం. తాజాగా నాచైతన్య హీరో రూపొందుతున్న బెజవాడ రౌడీలు సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వివేక్ కృష్ణ కూడా కొత్త దర్శకుడే. ఈ సినిమాను నిర్మిస్తున్న రాంగోపాల్ వర్మ తన శిష్యుడైన వివేక్ ను ఈ సినిమాకు దర్శకుడిగా ఎంపిక చేశారు.

అయితే...ఈ మధ్య తన కుటుంబ హీరోలతో సినిమాలు తీస్తున్న కొత్త దర్శకులు వరుసగా విఫలం అవుతున్న నేపథ్యంలో నాగార్జున వివేక్ ను పిలిపించుకుని స్పెషల్ క్లాస్ పీకాడట. సినిమాలో సొంత ప్రయోగాలకు పోకుండా ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీయాలని స్పష్ట చేసినట్లు సమాచారం

No comments: