Wednesday, November 30, 2011

ఇలియానాపై పగ తీర్చుకుంటున్న ఎన్టీఆర్





శక్తి సినిమా సమయంలో మొదలైన ఎన్టీఆర్, ఇలియానాల మధ్య కోల్డ్ వార్ పెరిగి పెద్దదే అవుతోంది. ఆమెను తాజాగా శ్రీను వైట్లతో తాను చేయబోయే చిత్రంలో బుక్ చేద్దామంటే ఎన్టీఆర్ వెంటనే నో చెప్పేసారు అని సమాచారం. దానికి కారణంగా తమ కాంబినేషన్ లో వచ్చిన శక్తి చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుందని కారణం చూపినట్లు చెప్పుకుంటున్నారు. అలాగే శక్తి సినిమా ప్రమోషన్ కి కూడా రాకుండా ఇలియానా నిర్మాతకు ట్విస్ట్ ఇవ్వటం గుర్తు చేసాడని వినిపడుతోంది. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న ఎన్టీఆర్ ఆమెకు సినిమాలు లేకుండా చేసాడని ఫిల్మ్ నగర్ లో అప్పట్లో వినపించిది. అయితే ఇప్పుడామె అల్లు అర్జన్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తోంది. దానికి తోడు ఇక శక్తి విడుదల అయ్యాక ఇలియానా ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వూలో తాను శక్తి చిత్రం చూసి చాలా నిరాశ చెందానని, తనకో కథ చెప్పి తెరపై మరొకటి చిత్రీకరించారని విమర్శిస్తూ మాట్లాడింది. అంతేగాక తన ప్యాన్స్ ని ఆ చిత్రం చూడమని చెప్పలేనని నిర్మొహమాటంగా చెప్పింది.

దానకి కోడు శక్తి ప్లాప్ చిత్రం అని,దాని ప్రమోషన్ లో పాల్గొనని తేల్చేసింది. ఇక అదే రోజున అశ్వనీదత్ గ్రాండ్ గా ఈ చిత్రానికి సంభందించి ప్రకటనలు గుప్పించారు. తమ చిత్రం విపరీతమైన కలెక్షన్స్ వసూలు చేస్తోందని, కొత్త రికార్డులు క్రియోట్ చేస్తోందని అన్నారు. దాంతో అదే రోజు ఇలియానా ఇంటర్వూ చూసిన వారికి అవన్నీ దొంగ లెక్కలని, కావాలని సినిమాని హైప్ చేస్తున్నారని అర్దమయింది. దాంతో ఇంకా కొద్దో గొప్పో వెళ్ధామనుకున్నవారు కూడా ఆగిపోయే సిట్యువేషన్ వచ్చింది. ఇది నిర్మాతగా అశ్వనీదత్ కీ, హీరోగా ఎన్టీఆర్ కి మింగుడు పడని విషయం. కోటి రూపాయలు రెమ్యునేషన్ తీసుకుని ఇలా భాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం వారికి నచ్చలేదు. దాంతో మండి పడుతున్న ఎన్టీఆర్ తన తోటి పెద్ద హీరోలతో చర్చించి ఆమెపై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టి ఆమెకు బుద్ది చెప్పారని అప్పట్లో వినిపించింది.అయితే ఇప్పుడు మళ్లీ శ్రీనువైట్ల ఆమెపై ఆసక్తి చూపినా వెంటనే ఎన్టీఆర్ తిరగకొట్టాడని వార్త.

No comments: