Thursday, November 26, 2009

BUMPER OFFER......MOVIE REVIEW

BUMPER OFFER......నేడే చూడండీ రేపు ధియేటర్లో ఉంటుందో లేదో తెలియదు.....

FINAL ANALYSIS : AVERAGE.......U can go only for RAGHU KUNCHEY music n PURI JAGANNADH trade mark........

Bumper Offer.....Bumper Offer...BUMPER OFFER...ఏంటి... దసరా..,దీపావళి..,అయిపోయింది కదా ఇంక వీడు షాపింగ్ మాల్ లో తగ్గింపు ధరలు గోల తగ్గిన వీడు ఏంటి ఇంకా బంపర్ ఆఫర్...బంపర్ ఆఫర్..అంటు అరుస్తునాడు అనుకోకండి.........ఈదే పూరి వారి తమ్ముడు సాయిరామ్ సరికొత్త సినిమా పేరు.......ఇంకెందుకు ఆలస్యం చదవండి........

హీరో అంటే ఓ అదర్శ పురుషుడు గానో, హీమాన్ గానో చూపించాల్సిన పనిలేదు. హీరోని కావాల్సినంత అల్లరి చిల్లరిగా చూపించి చివర్లో ఓ చిన్ని ట్విస్ట్ పడేస్తే సరిపోతుంది. అసలు హీరోయిజాన్ని రివర్స్ చేస్తే ఓ కొత్త ప్లాట్ కాదూ? పూరీ జగన్నాథ్ కు వచ్చిన అలాంటి తాజా ఆలోచనకు వెండితెర రూపమే 'బంపర్ ఆఫర్'. ఆయన కథతో పాటు సంభాషణలు, నిర్మాణం వంటి కీలక బాధ్యతలను తీసుకుని దర్శకత్వ బాధ్యతలను మాత్రం జయ రవీంద్రకు అప్పగించారు. పేరుకు జయ రవీంద్ర దర్శకుడే అయినా ముద్ర మాత్రం పూరీదే. ఇందులోని 'రివర్స్ హీరోయిజం' బహుశా ఇంతవరకూ ప్రేక్షక జనం చూసి ఉండరు. నలుగురూ నడిచే రూట్ లో నడిస్తే క్రియేటివీ ఎందుకవుతుంది? అదే పూరీ స్టయిల్. పిల్లనిచ్చే తండ్రి తన అల్లుడు తనలాగా రిచ్ మన్ కావాలని కోరుకుంటే (కొద్దిపాటి ఆఫర్ ఇచ్చి), ఆ కుర్రాడు మాత్రం మామనే పాపర్ చేస్తానంటూ రివర్స్ లో 'బంపర్ ఆఫర్' ఇస్తాడు. ఏ మాత్రం సినీ పరిజ్ఞానం ఉన్నా చిరంజీవి 'ఛాలెంజ్' సినిమా ప్లాట్ కు ఇది రివర్స్ అని గ్రహించేయొచ్చు .........

No comments: