రేపో మాపో......."అదుర్స్"...."నమోవెంకటేస".....అంటూ N.T.R.......VENKATESH వస్తున్నారు ఇంకా ఈ "కిక్" గోల ఏంటి అని నన్ను తిట్టుకోకండి........ఈది నా బెస్ట్ ఫ్రెండ్ "CHARAN" కీ............ సో........"CHARAN" కోసం చదవండి...........
కావాలి అంటే " sportz_charan@yahoo.co.in" మాట్లాడుకోండి..........
చెర్రీ ఈ రివ్యూ......నీకోసం చదువుకో.........మీరుకూడా.........
వేసవి లో అసలు "కిక్"..........................
FINAL ANALYSIS : SUPER HIT to SILVER SCREEN in HOT summer......
కమర్షియల్ సినిమా ఫార్ములా చాలా సందర్భాల్లో మాస్ పల్స్ ను బట్టే ఉంటుంది. వినోద ప్రదాన మాధ్యమం సినిమా కావడంతో రొటీన్ కు భిన్నంగా ఏమి చెప్పినా ప్రేక్షకులు పట్టం కడతారు. ప్రేక్షకులకు నచ్చిందే ఆ తర్వాత ఫార్ములా అయి కూర్చుంటుంది...........'జంటిల్ మెన్'...'ధూమ్ -2'...ఇంకా ఎన్నో దొంగాపోలీసు డ్రామాతో వచ్చిన సినిమాలన్నీఈ లైన్స్ నుంచి అల్లుకున్నవే. 'కిక్' సైతం ఇదే కోవలోకి వస్తుంది. కాకుంటే ఈసారి యాక్షన్ కంటే పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ కే ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా 'కిక్'ను 'మాస్'కు దగ్గర చేర్చే ప్రయత్నం దర్శకుడు సురేందర్ రెడ్డి చేయడం కనిపిస్తుంది.................
ARTIST PERFORMANCE :
రవితేజ చురుకైన దొంగగా తన పాత్రలో పరకాయప్రవేశం చేశారు. బ్రహ్మానందంను ఆటపట్టించే సన్నివేశాలు బాగా పండాయి. ఒకరకంగా ఈ ఇద్దరి మధ్యా 'కృష్ణ' సినిమాలో నడిచిన కామెడీ ట్రాక్ కు ఇది కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. ఇలియానా ఇప్పుడు కొద్దిగా బరువు పెరిగి మరింత సెక్సీ లుక్ ను సంతరించుకోవడం విశేషం....... నటనపరంగా ఫరవాలేదు. తమిళ నటుడు శ్యామ్ హ్యాండ్ సమ్ గా ఉండటంతో పాటు పోలీసు పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. ఇండియాలో హల్వా రాజ్ గా, మలేసియా లో ప్రకాష్ రాజ్ గా బ్రహ్మానందం మరోసారి ప్రేక్షకులను హాయిగా నవ్వించారు. ఇలియానాపై మనసు పారేసుకోవడం, రవితేజతో పడిన తిప్పలు నవ్విస్తాయి. మెమరీ లాస్ పేషెంట్ అయిన ఆలీ డాక్టర్ వేషంలో ఆలీ, సబ్ ఇన్ స్పెక్టర్ గా జయప్రకాష్ రెడ్డి తగు మోతాదులో నవ్వించారు. చాలాకాలం తర్వాత సీనియర్ నటి ప్రభ ఇందులో కనిపించి ఇప్పటికీ గ్లమార్ గానే కనిపించడం అబ్బురపరుస్తుంది.........
No comments:
Post a Comment