1980
ప్రభు, చంద్రమోహన్, ధర్మవరపు, ఆహుతిప్రసాద్, ఎం.ఎస్. నారాయణ, శివన్నారాయణ స్నేహితులు..................అప్పుడప్పుడు కలుస్తూ, ఒకరికొకరు ఆనందంగా ఉంటారు. వారి కుటుంబాల్లో ఆహుతిప్రసాద్ కుమార్తె నందిని (కాజల్), ప్రభు కుమారుడు ప్రభాస్ (ప్రభాస్) మంచి స్నేహితులు. వయసుతోపాటు వారి ప్రేమా పెద్దదవుతుంది. కాలమాన పరిస్థితులు ఆ కుటుంబాలను దూరం చేస్తాయి. చదువు పెద్దగా అబ్బకపోయినా డాన్స్‌లోమేటిగా ఎదుగుతాడు ప్రభాస్. అతని ట్రూప్‌లో ఉండే ముఖేష్‌రుషి ఓ గూండా. ఇతని కుమార్తె శ్రద్దాఆర్య గాయని. ప్రభాస్‌ను ఇష్టపడితే సున్నితంగా తిరస్కరిస్తాడు. అహం దెబ్బతిని ఆత్మహత్యాయత్నం చేసుకుంటుంది. పూర్వపు కుటుంబ స్నేహితులంతా ఓ చోట కలుస్తున్నారని తెలియడంతో నందిని కోసం ప్రభాస్ వెళతాడు........................కానీ అక్కడ తనను పట్టీపట్టనట్లు చూడడం, రుషి అనే మరో వ్యక్తికి దగ్గరవడం చూసి షాక్ తింటాడు........నందిని తనని ప్రేమిస్తుంది అని ఊహించుకొని వచ్చిన ప్రభాస్ ఎలా తెలియడం తో...........
INTERMISSION
పూర్వపు కుటుంబ స్నేహితులంతా ఓ చోట కలుస్తున్నారని తెలియడంతో నందిని కోసం ప్రభాస్ వెళతాడు. కానీ అక్కడ తనను పట్టీపట్టనట్లు చూడడం, రుషి అనే మరో వ్యక్తికి దగ్గరవడం చూసి మొదట కలత చెందినా ఆ తర్వాత నందిని తననే ప్రేమిస్తుందనే నిర్ణయానికి వస్తాడు. కానీ నందిని తండ్రి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ రుషినే అల్లుడ్ని చేసుకోవాలనుకుంటాడు.................
ARTIST PERFORMANCE
మొదటిభాగం స్విట్లర్లాండ్‌లో సరదాగా సాగుతుంది. ప్రభాస్ జోవియల్‌గా నటించాడు. ప్రేమకథా చిత్రానికి సరిపడా హావభావ విన్యాసాలు ఉన్నాయి. అతని స్నేహితులుగా శ్రీనివాసరెడ్డి, రాజాశ్రీధర్‌తోపాటు మరో ఇద్దరు వినోదం పంచారు. సెకండాఫ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు అలరించాడు. తాగుబోతుగా ఎం.ఎస్. చేయడం రొటీన్. సినిమా మొత్తంగా ఒకే ఒక్క డైలాగ్‌తో కోట మెప్పించాడు. అందర్నీ అలరిస్తూ నందిని తమ్ముడు మాస్టర్ రవి చేసిన పనులు ఆకట్టుకున్నాయి. దీనికితోడు గూండా అయిన ముఖేష్‌రుషి ప్రేమ సెంటిమెంట్‌తో నీరుగారిపోవడం కామెడీగా ఉంటుంది. స్వామి సంభాషణలు మోస్తోరుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీకి టెక్నికల్ తోడై హైదరాబాద్‌ను స్విట్లర్లాండ్ తరహాలో చూపించి కొత్తప్రయోగం చేశాడు దర్శకుడు. జివిప్రకాష్ సంగీతం గొప్పగాలేకపోయినా ఒకే ఒక్కపాట బాగుంది. నిర్మాత భోగవల్లిప్రసాద్ ఈ సినిమా ద్వారా ప్రభాస్‌కు క్లాస్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నం చేశాడు. రొటీన్‌కథే అయినా వచ్చే ట్విస్ట్‌లు నవ్వుతెప్పిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో ఏం జరగనుందో ప్రేక్షకుడు ఊహిస్తాడు. సాగతీతగా ఉన్నా పిల్లల్తో చూడతగిన సినిమాయే !
No comments:
Post a Comment