Thursday, July 8, 2010

BHEEMILI KABADDI JATTU MOVIE REVIEW





స్వచ్చమయిన పల్లెటూరి జట్టు......... భీమిలి కబడ్డీ జట్టు.......



FINAL ANALYSIS :AVERAGE.........We Must Appreciate for Director Thought for Giving a Sports Cinema After a Long time on 700MM Screen.............



మూడు ముద్దులు.....ఆరు గుద్దులు.....ఒక బికిని పాట......ఇదే మన తెలుగు సినిమా అనుకునే వారికీ సినిమా నచ్చదుగాకనచ్చాదు...........హీరోయిన్స్ మీద కొబ్బరి చిప్పలు వేయడం కాదు వాళ్ళకి ముందు మంచి గుడ్డ ముక్కలు కట్టండి అప్పుడు వస్తారు.........జుమ్మంది అంటారు............

నేను ఎవరిని విమర్శించడం లేదు........ఉన్నదే చెబుతున్న........మూడు గంటల సినిమా ముప్పయి సంవస్తరాల మనిషి మీద ప్రబావం చూపుతుంది.........ఆది గుర్తుకు పెట్టుకొని సినిమాలు తీయండి......

హంగులు....బొంగులు లేకుండా......అందమయిన పల్లెటూరి లో తీసిన స్వచ్చమయిన తెలుగు సినిమా....... భీమిలి కబడ్డీ జట్టు..........

తమిళ వారు రసికులు అంటారు.......వాళ్ళు కాదు మనం వాళ్ళకన్నా రాసికులం.......ఎంతసేపు అంగ అంగ ప్రదర్సానే తప్ప.....ఇంక ఏమి తెలియదు మనకు........వాళ్ళు(తమిళ జనాలు) బికిని పాపను ఎలా చూస్తారో......లంగా వోని పాపను అంత కన్నా బాగా ఆదరిస్తారు.........

కానీ మనం.........వద్దు ఎంత చెప్పుకున్న మీకు నాకు టైం బొక్క.........





ENTER IN TO THE SHOW




MEDIA PATNERS













సూరి(నాని) నాన్న చిన్న తనంలోనే చనిపోతాడు........తండ్రి చనిపోయిన తర్వాత ఊరి భూస్వామి సూరి నీ పెంచుతాడు.......

చిన్నప్పుడు నుంచి.......సూరి కీ "కబడ్డీ" ఆట అంటే చాల ఇష్టం..........కబడ్డీ ఆట నేర్చుకోవాలి అని కొంత మంది స్నేహితులతో తిరుగుతుంటాడు.........కానీ సూరి కీ ఆట సరిగ్గా రాదు అని వాళ్ళు సూరి నీ జట్టు లో చేర్చుకోకుండా కేవలం అతిధి ఆటగాడి వల్లే చూస్తారు......

ఇంతలో రాజమండ్రి లో డిగ్రీ చదువుకుంటున్న శరణ్య మోహన్(ఈమె పాత్ర పేరు చివరివరకు తెలియదు) అన్న వదినలు ఉంటున్న "భీమిలి" వస్తుంది......అక్కడ జాతర జరుగుతుండడంతో అక్కడికి వెళ్ళిన సూరి కీ శరణ్య కనపడుతుంది.......తోలి చూపులోనే ప్రేమిస్తాడు.........శరణ్య కూడా సూరి నీ ఇష్టపడుతుంది........

ఈది ఎలా ఉండగా........కబడ్డీ జట్టు లో ఎలా అయిన చోటు సంపాదించాలి అని......కబడ్డీ మీద తన దృష్టినినిలుపుతాడు.....ఇంతలో ఊరి లో జాతర అయిపోవడం తో.......తన సొంత ఊరు అయిన రాజమండ్రి వెళ్ళిపోతున్న శరణ్య ఎలా అయిన సూరి నీ కలిసి తన ప్రేమనీ చెప్పాలని ప్రయతిన్స్తుంది........కానీ సూరి కబడ్డీ ఆట లో పడీ....శరణ్య వెళ్తున్న సంగతి మర్చిపోతాడు.......

సూరి.....శరణ్య వెళ్ళిపోయినా సంగతి తెలుసుకొని చాల బాధపడతాడు........కానీ అనుకోకుండా శరణ్య చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి....అప్పుడు జాతరలో శరణ్య తను రాజమండ్రి ప్రబుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అని చెబుతుంది......ఎలా అయిన శరణ్య నీ దక్కించుకోవాలి అని పట్టుదలగా ఉంటాడు.....ఇంతలో సూరి కీ అనుకోకుండా........భీమిలి కబడ్డీ జట్టు లో ఆటగాడి గా చోటుదక్కుతుంది......

ఆది కూడా......రాజమండ్రి లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టు పోటిలలో.....దీంతో ఎలా అయిన జట్టు విజయం తో పాటు......సర్న్య ప్రేమ నీ దక్కించుకోవాలి అని.....రాజమండ్రి బయలుదేరతాడు.......


INTERVAL


స్నేహితులతో కలిసి రాజమండ్రి వెళ్ళిన సూరి వాళ్ళ జట్టు కీ అనుకోకుండా ఒక షాక్ తగులుతుంది........రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టులు ముందే ఎన్నుకుంటారు అని భీమిలి వాళ్ళకి ఆడే అవకాసం లేదు అని తెలుస్తుంది........దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న జట్టు వాళ్ళు.......అంతటికి కర్ణం సూరి నే అని తిడతారు.........


అందరు ఇలా బాధలో ఉన్న సమయం లో.......సూరి వాళ్ళకి ఒక మంచి వార్త చెబుతాడు........అనుకోకుండా అదో ఒక టీం రాకపోతే మనకి ఆడే chance ఉంటుంది అని.......తెలుసుకుంటాడు.......వాళ్ళ టైం బాగుండడం వాళ్ళ.......అనుకోకుండా హైదరాబాద్ టీం వాళ్ళు రాకపోవడం తో...... టీం కోచ్(కిషోర్) వాళ్ళకి మాట సహాయం చేస్తాడు.....ఎలా అయిన రాష్ట్ర స్థాయి పోటిలలో ఆడిస్త అని.......

ఇదే సమయం లో......హైదరాబాద్ టీం కెప్టెన్......కోచ్ తో గొడవపడడం తో......అతను టీం నుంచివిడిపోయి........భీమిలి జట్టు కీ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు...........చివరికి రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుపోటిలలో......."భీమిలి కబడ్డీ జట్టు" గెలుస్తుంది......

కానీ....జట్టు సాదించిన విజయం కన్నా.......ఆట లో చనిపోయిన సూరి నీ చూసి అందరు బాధపడతారు........కేవలం సూరి కోసం అక్కడికి వచ్చిన శరణ్య దృశ్యం చూసి ఎలా నటించిందో...........మనం తెర మీద చూడాలి........


చివరికి తను ప్రాణం గా చూసుకునే...కబడ్డీ ఆట నీ గెలిపించి తను చనిపోయిన........ప్రేమ లో వోడిపోయిన........ఒక భీమిలి కుర్రాడి కథ.....




END




UNIT PERFORMANCE


NANI : పల్లెటూరి అమాయక పాత్రలో....సూరిగా నాని పాత్ర చాల బాగుంది.....చాలా బాగా చేసాడు........అతని హావభావాల్లో చక్కని పరిణితి కనిపిస్తుంది.నటుడిగా యువ హీరోల్లో మంచి భవిష్యత్తున్న హీరో అవుతాడు నాని......

SARANYA MOHAN : పాత్ర పేరు చివరి వరకు మనకి తెలియకుండా కథ నీ నడిపించిన హీరోయిన్ పాత్ర బాగుంది......మన తెలుగు పిల్ల కాకపోయినా.....మొదటి నుంచి చివరి వరకు ఆమె చేసిన హవబవాలు......చాలా బాగునాయి......ఉన్నంతలో ఆమె బాగానే నటించింది.........ఈపుడు వస్తుంది వాంప్ పాపాలు(హీరోయిన్స్) కన్నా చాల పద్దతిగా చేసింది........

కబడ్డీ జట్టులోని సభ్యులంతా ఫరవాలేదనిపించారు.కబడ్డీ కోచ్ గా నటించిన కిశోర్ ఇంకా బాగా నటించి ఉండొచ్చు."సై" సినిమాలో రాజీవ్ కనకాల రేంజ్ లో ఇతని నటనుంటే ఈ చిత్రం ఇంకా బాగుండేది.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు..........



TatiNeni Satya : తాతినేని సత్య......ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రసాద్ గారి అబ్బాయి....... తొలిసారి దర్శకత్వం వహించినా బాగానే తన బాధ్యతను నిర్వర్తించాడని చెప్పాలి........మొత్తానికి సినిమాని బాగానే హ్యాండిల్ చేయగలిగాడు దర్శకుడు సత్య.....

సంగీతం - సెల్వ గణేష్ సంగీతంలోని పాటల కన్నా రీ-రికార్డింగ్ ఇంకా బాగుంది.పాటల్లో "పదపదమని తరిమినదే"అన్నపాట వినటానికి చూడటానికి కూడా బాగుంది........
.

2 comments:

Anonymous said...

Rajesh Good review :)

pvkarthik said...

gud mamz keepy top.....gr8 wrting......