Wednesday, July 14, 2010

SUBHAPRADAM MOVIE REVIEW............







స్వచ్చమయిన తెలుగుసినిమా ఈ "శుభప్రదం"........


FINAL ANALYSIS : 100% TELUGU MOVIE After So Many Years on 70MM Secreen......THANKS to Vishwanadh Garu for Giving Excellent Movie.......Defentlly it will GOOD and Excellent Movie.......


ముందు ఈ సినిమా గురుంచి కాదు....మన తెలుగు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చెప్తా వినండి.........


ముందు....హీరో...సదరు హీరో గారు విలన్ గాడిని ఒక్క గుద్దు గుద్దితే విలన్ గాడు వేన్నిపుస లో ఉన్న
26 వ ఎముక విరిపోతుంది.......విలన్ గుండె కూడా బయటికి వచేస్తుంది మరీ మాస్ హీరో అయతే..........

ఇంకా హీరొయిన్.........ఓయ్! అనడం ఎప్పుడో పోయింది.......అమ్మడు "నువ్వు" పోయి "నీయబ్బ" కీ వచ్చేసింది...........అంతే నా కోసి చేతిలో పెట్టేస్త అనేస్తుంది....కాదు కాదు సదరు డైరెక్టర్ గారు అంత కన్నా ముందు "కోటి" రూపాయులు అమెచేత ఇలా బికినిలు.......బెవర్సే మాటలు చెప్పేస్తుంది.......


ఇంకా "డైరెక్టర్".....సినిమా ఎలా తీసాం అన్నది కాదు అన్న......ఎన్ని దేశాలు.....ఎన్ని కోట్లు కర్చుపెట్టం అన్నది పాయింట్.........ఎందుకంటే హీరో హీరొయిన్ ఇద్దరు.....హైదరాబాద్ లో ఉంటారు....కేవలం రెప్పపాటు సమయం లో అమెరికా పోతారు పాట కోసం సుమ!...........ఏంటో తెలుగులో ఒక సామెత ఉంది "వినేవాడు చెప్పేవాడికి లోకువ" అని....మన డిరెక్టర్లు కాస్త ఆటు ఇటు మర్చి.....మనకి బొమ్మ చుపిస్తునారు,...........

గోల అంత మాకు ఎందుకుముందు సినిమా చూపించార అనితిట్టుకోకండి........తెలుగు సినిమాస్థాయి పెరిగింది అంటున్నారు కాదుదిగజారిపోతుంది అని చెప్పడానికిపయిన అన్ని చెప్పా.........సరే మన సినిమా విషయానికివద్దాం...... .









ఇందుమతి{మంజీర}.....కేరళ లో అలపులం లో ఉంటున్న సంప్రదాయమయిన కుటుంబానికి చెందినాఅమ్మాయి.......ఇందుకీ ముగ్గురూ అన్నయలూ వాళ్ళు..."వైజాగ్ ప్రసాద్....అశోక్ కుమార్....గుండుసుదర్శన్)....అందరు కలిసిమెలిసి ఒక మంచి కుటుంబం గా ఉంటారు.......

అఖిల కేరళ తెలుగు సమక్య సంగిత వేడుకులకు సదరు నిర్వాహకులు ప్రముఖ గాయకులూఎస్.పీ.బాలసుబ్రమణ్యం" గారిని నిర్వహుకిలిగా ఉండమంటారు.......దానికి అయిన సంతోషం గాఒప్పుకుంటారు.......

ఇది ఇలా ఉండగా......
"
చక్రిగా పిలవవడే చక్రధరరావు (అల్లరి నరేష్‌)కు తలబిరుసు ఎక్కువ. పెద్దా చిన్నా తేడాలేకుండా మాటల్తో ఎడాపెడా వాయించేస్తాడు. తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమలో పడేసేందుకు నోటికొచ్చిన అబద్ధమల్లా ఆడేస్తాడు....కేరళ లో తన బాబాయ్ ఇంటికి తూర్పుగోదావరి జిల్లా నుంచి వస్తాడు.......

అక్కడ చక్రి.....ఇందు (మంజరి)ఇంటిలోనే క్యాటరింగ్‌ పనులు చేయాలి. కానీ చక్రి తాను బాలసుబ్రహ్మణ్యం అంతటి గాయకుడని బిల్డప్‌ ఇస్తాడు. ఆ క్రమంలో ఇందు అతనిపై మనసుపారేసుకుంటుంది........కానీ చక్రి నిర్లక్ష్యపు ధోరణి చుసిన ఇందు అన్నయలు చక్రి నీ మాత్రం ఇష్టపడరు.......అంతే కాదు ఇందు చక్రిలా పెళ్లి జరగదు అని తెల్చిచేప్పేస్తారు....... నేపద్యంలో ఇందు చక్రిలు విడిపోతారు......మళ్ళి ఒక ఏడాది తర్వాత వచ్చి ఇందు పెద్దవాళ్ళని ఒప్పించడానికి ప్రయతినిస్తడు........

ఇందు పెద్దలు అంగీకరించకపోతే తను కష్టపడి సంపాదించిన సొమ్ముతో బంగారు ఆభరణాలు తెచ్చానని అవి చూపించి పెండ్లికి అంగీకరించేలా చేస్తాడు. పెండ్లిచేసుకుని తన జిల్లాకు వచ్చి తనో అసిస్టెంట్‌ డాక్టర్‌ అని ఇందుకు చెప్పి నమ్మిస్తాడు. కానీ గుడిలో తాను ఇచ్చినవి కాకిబంగారమనే నిజాన్ని వెల్లడిస్తాడు............

ఇందుకి తన భర్త చేసే ఉద్యోగం గుడిలో పిల్లల్ని, వృద్ధుల్ని తీసుకెళ్ళే 'డోలిమోసే'వాడని తెలుస్తుంది. అయినా అతనిపై మరింత ప్రేమ కురిపిస్తుంది......ఒకరోజు గుడి మెట్లవద్ధ అనారోగ్యంతో సొమ్మసిల్లిన పడిపోయిన శివానంద మూర్తి{శరత్‌బాబు} ను ఇందు ఆదుకుంటుంది. ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేస్తుంది. అనుకోనిరీతిలో వీరిమధ్య ఇలా...ఒకరంటే ఒకరికి మమకారం ఏర్పడుతుంది.......

కానీ శివానంద మూర్తి{శరత్‌బాబు}........ఇందుకీ నమ్మలేని నిజం చెప్తాడు.......తనకి ఒక మనవరాలు ఉంది అని...తన పేరు "సింధు"{మంజీర} అచ్చం నీలానే ఉంటుంది......కాలేజీ లో జరిగిన ఎసిడ్ దాడి లో చనిపోయింది అని చెప్తాడు..........

తన మనవరాలు పోలికలతో ఉన్న...ఇందు తో తన శేషజీవితం గడాపాలి అని ఉంది అని కోరుతాడు శివానందమూర్తి.........దీనికి ఇందుకుడా సరే అనడంతో.......అందరు ఆనందం ఉంటారు......కానీ చక్రి గురుంచి తెలుసుకున్న శివానంద మూర్తి ఎలా అయిన అతనిలో మార్పు తిసుకోనిరవాలి అని.......అతని చేత సంగీతం నేర్పిస్తాడు.........దానితో పాటు ఇందు వాళ్ళ కుటుంబ సబ్యులు కూడా చక్రి నీ ఇస్తా పడేటట్టు చేయాలి అని చక్రి నీ మంచి గాయకుడిని చేస్తాడు.......

ఇదే "విశ్వనాద్" గారు మనకి ఇచ్చిన "శుభప్రదం"

"శుభప్రదం" సభ్యుల నటన

* అల్లరి నరేష్‌ తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా అల్లరి చేశాడు. కొన్ని సన్నివేశాలు మోతాదు మించినట్లున్నాయి. చిత్రంలో అతని పాత్ర కామెడీకే ఉపయోగపడింది......

* ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇందుగా నటించిన మంజరీ ఫడ్నిస్‌ గురించి. కథంతా ఆమే మోసింది.పాటకు తగ్గ ఆట(నృత్యం)ను చూపడంలో మంజరి మేటిగా నిలిచింది...ఖచ్చితంగా "మంజిరి" కీ మంచి నటిగా భవిష్యత్తు ఉంది......తెలుగు సినిమా పరిశ్రమ ఈమె వైపు చూస్తే మరో భానుప్రియ దొరికినట్టే..........

*బాబారు పాత్రల్లో అశోక్‌కుమార్‌, వైజాగ్‌ప్రసాద్‌, గుండు సుదర్శన్‌ పాత్రలు అసహజంగా ఉన్నాయి. అనవసరపు మేకప్‌ తగిలించడం వల్ల పాత్రల్లో సీరియస్‌నెస్‌ లోపించింది. కేరళ తెలుగు అసోసియేషన్‌ సభలో బాలసుబ్రహ్మణ్యం కన్పిస్తాడు. క్లైమాక్స్‌లో యాంటీ రాగింగ్‌ అసోసియేషన్‌ గురించి లెక్చరిస్తూ విశ్వనాథ్‌ కన్పిస్తారు.......

*'చప్పట్లు..తాళాలు.. అచ్చట్లు..ముచ్చట్లు..' వంటి పాటలు బాగున్నాయి......సందర్భానుసారంగా వచ్చే పాటల్తో మణిశర్మ బాణీలు అలరించాయి.

*ఇంక "విశ్వనాద్" గారి గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువ ఆవుతుంది.........ప్రతి ఫ్రేం ఎంతోఅందంగా...అద్భుతంగా.....తెలుగు తనం కనిపించింది..........

No comments: