Friday, August 6, 2010

DON SEENU MOVIE REVIEW






కామెడి తో దరువు వేసిన........ "డాన్ శీను"


FINAL ANALYSIS : Above AVERAGE.......Movie with RaviTeja Common Comdey and Smashing Performance........Shriya Sexy GLAMOUR is another HOT Dish to Audiance after Long Time.....


"
అబ్బ!......ఎం ఉందిరా అప్పటికి ఇప్పటికి కత్తి ఎం ఉంది శ్రియ..."

ఇది నేను సినిమా హాల్ లో సినిమా మొదలు అయిన తర్వాత విన్న మొదటి మాట.......



నలుగురు కలిసి నవ్వుకునేట్లుగా ఉంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇందుకోసమే సినిమా తీసేవారు తగు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందులోనూ రవితేజ చిత్రమంటే అటువంటివాటికి ఎక్కువశ్రద్ధ పెడతారు. కథలో ఏదో కొద్దిమార్పుచేసి దాన్ని వినోదాత్మకంగా మలిస్తేచాలు ఆ సినిమా సక్సెస్‌కిందే లెక్కే. గతంలో కింగ్‌, రెడీ, ఢ వంటి చిత్రాల్లో చూసిన కథాగమనమే అయినా దాన్నుంచి కొంచెం పక్కకు వచ్చి ఇలా తీస్తేకూడా బాగుంటుందని నిరూపించిన చిత్రమే 'డాన్‌శీను'. రవితేజ చురుకైన బాడీలాంగ్వేజ్‌కు పాత్రలో ఇమిడిపోయాడు. దర్శకుడిగా గోపీచంద్‌ మలినేని సోదరి సెంటిమెంట్‌తో రక్తికట్టించాడు. చిన్నపాటి లోటుపాట్లు ఉన్నా అవేవీ రన్నింగ్‌లో పెద్దగా గుర్తుచేసేవిగా ఉండవు








జగపతిబాబు వాయిస్‌ఓవర్‌తో కథ ప్రారంభమవుతుంది.

చిన్నప్పుడే శీను(రవితేజ)కు అమితాబచ్చన్‌ అంటే వీరాభిమానం. 'డాన్‌' సినిమాను మొదటిసీటులో కూర్చుని లెక్కలేనన్ని సార్లు చూస్తాడు. ఇంట్లోనూ స్కూల్లోనూ డాన్‌శీనుగా పిలవాలని పట్టుబడతాడు. సవతి తల్లి, దండ్రుల్తోపాటు అందర్నీ పేరుపెట్టి పిలిచే శీను తన బాబారును, ఆమె కుమార్తెను మాత్రం ఆప్యాయంగా పలుకరిస్తాడు. ఉద్యోగరీత్యా వారు వేరే ఊరుపోవడంతో వారితోపాటు శీను వెళ్ళిపోతాడు. కానీ తన గోల్‌ మాత్రం మారదు. ఎప్పటికైనా డాన్‌శీనుగా పేరుపొందాలని పచ్చపొట్టుకూడా పొడిపించుకుని అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. పెద్దవాడయ్యాక తిరిగి సిటీకి వచ్చి అక్కడ మలక్‌పేట నర్సింహ (శ్రీహరి), మాదాపూర్‌ మాచిరాజు (షాయాజీ షిండే) అనే డాన్‌లున్నారని తెలుసుకుని వారిలో ఒకరి దగ్గర పనిచేయాలని డిసైడ్‌ అయిపోతాడు. డాక్టర్లు, ఇంజనీర్లుకంటే డాన్‌ అయితేనే ఎన్నో సౌకర్యాలుంటాయనేది శీను పాలసీ. ఆ క్రమంలో మాచిరాజు దగ్గర చేరి మొదటగా అతను అప్పజెప్పిన పనికోసం జర్మనీ వెళతాడు. అతను చెప్పిన పనిప్రకారం జర్మనీలో సైకాలజీ కోర్సు చేస్తున్న నర్సింహ ముద్దుల చెల్లెలు దీప్తి (శ్రియశరణ్‌)ను ప్రేమిస్తాడు. అప్పటికే తన చెల్లెల్ని సూపర్‌డాన్‌ ముఖేష్‌ దుగ్గళ్‌ (మహేష్‌ మంజ్రేకర్‌) కొడుక్కిచ్చి పెండ్లిచేయాలని నర్సింహ ఫిక్స్‌చేస్తాడు.

అయితే తాను ప్రేమించింది నర్సింహ సోదరిని కాదని తెలుసుకున్న డాన్‌శీను ఓ డ్రామా ఆడతాడు. ఆ డ్రామా ప్రకారం నర్సింహ సోదరి ప్రియ (అంజనా సుఖాని)నే ప్రేమిస్తున్నట్లు మాచిరాజును నమ్మిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ డాన్‌శీనును ప్రేమిస్తారు. ఇది సహించని డాన్‌శీను స్నేహితుడు అలీ వారికి అసలు నిజాన్ని చెప్పేస్తాడు. దాంతో వారిద్దరూ శీనును నిలదీయగా ఓ కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. దీంతో శీను విషయం తెలుసుకొని కథ నీ ముగిస్తాడు.......


రవితేజ తన హుషారైన నటనతోపాటు డాన్స్‌లు ఫైట్లలోకూడా వినోదాన్ని పంచాడు. సెకండాఫ్‌లో తనపై నిఘావేసిన విశ్వాస్‌ (బ్రహ్మానందం) పాత్రకు జలక్‌ఇచ్చే మూగవాడి పాత్రనూ రవితేజ మెప్పించాడు. స్క్రీన్‌ప్లేలో ఈ వేరియేషన్స్‌ను జాగ్రత్తగా డీల్‌ చేయడంలో దర్శకుడు గోపీచంద్‌, కోనవెంకట్‌ కృతకృత్యులయ్యారు. గుడ్డివాడిగా వేణుమాధవ్‌ నటన రొటీన్‌ అయినా సన్నివేశపరంగా కొత్తగా ఉంది. శ్రియాశరణ్‌ తన అందచందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అంజనా సుఖాని పరిమితిమేరకే ఉంది. వీర్దిదరితోపాటు శ్రీహరి, షిండే పాత్రలతో డాన్‌శీను చేసే విన్యాసాలు సరదాగా ఉంటాయి. ఢలోీ చేసిన తరహా పాత్రే అయినా శ్రీహరి కొత్తగా ఉంది. షిండే పాత్రకూడా డిటోనే. సూపర్‌డాన్‌గా మహేష్‌మంజ్రేకర్‌ హుందాతనాన్ని పండించాడు. కాకపోతే క్లైమాక్స్‌లో పిల్లిలా మారడంతో ఆ పాత్రను కావాలని తగ్గించి నట్లుంది. రవితేజకు డాన్‌ శీనుగా అవ్వాలనే జీవితాశయాన్ని మర్చిపోయి అర్థాంతరంగా ముగింపు ఇవ్వడం విచిత్రం. రఘుబాబు, సురేఖావాణి పాత్రలు రొటీన్‌గానే ఉన్నాయి.

నిర్మాణవపు విలువలు బాగున్నాయి. సమీర్‌రెడ్డి ఫొటోగ్రఫీ జర్మనీ అందాలు కనువిందుచేశాయి. దుగ్గళ్‌ కొడుకును డాన్‌శీను పబ్లిక్‌గా కొడితే, అతను చేసింది తప్పా? ఒప్పా? అంటూ ఎస్‌.ఎం.ఎస్‌.లు పంపించే విధానం ఛానళ్ళపై సెటైర్‌ అయినా నవ్వుతెప్పిస్తుంది. 'ఒంటిపేరు శీను. ఇంటిపేరుడాన్‌.. డాన్‌గా ఉంటే ఎన్నో లాభాలూ..' 'అందమేమో ఇస్తారావే..' అనే పాటలు మాస్‌ను ఆకట్టుకుంటాయి. సీరియస్‌సాగే గమనంలో 'రాజారాజా రవితేజ..' పాట స్పీడ్‌బ్రేకర్‌లా ఉంది. మణిశర్మ సంగీతం మెచ్చదగిందే. మొదటి భాగం వినోదాత్మకంగా సాగింది. రెండవభాగం సెంటిమెంట్‌ జోడింపుతో కాస్త నిడివి ఎక్కువగా అన్పిస్తుంది. ఏది ఏమైనా ఖర్చుపెట్టిన ప్రేక్షకుడికి కాసేపు ఆటవిడుపుగా డాన్‌శీను ఉంటుంది.

No comments: