తెలుగుచిత్ర పరిశ్రమకు సంక్రాంతి, వేసవి సీజన్‌లే కాదు, దసరా కూడా
భారీ ఆదాయాన్ని సమకూర్చి కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ
ఏడాది సంక్రాంతి సంగ్రామంలో పోటీపడ్డ చిత్రాల్లో ఎన్టీఆర్ ‘అదుర్స్’,
వెంకటేష్ ‘నమో వెంకటేశ’ చిత్రాలు మాత్రమే కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించాయి. ఆ తర్వాత నాగ చైతన్య ‘ఏమాయ చేసావె’ హిట్టయింది. ఇక వేసవిలో వినోదపరచడానికి వచ్చిన చిత్రాల్లో ప్రభాస్ ‘డార్లింగ్’ ఫర్వాలేదనిపిస్తే, బాలకృష్ణ ‘సింహా’ కమర్షియల్‌గా విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో సునీల్ ‘మర్యాదరామన్న’, రవితేజ ‘డాన్ శీను’ ఓకే అనిపించుకున్నాయి. మొత్తానికి ఈ తొమ్మిది నెలల్లో ఆరు కమర్షియల్ హిట్లతో పరిశ్రమ బండి లాగిస్తున్న తరుణంలో దసరాకు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచడానికి పరిశ్రమకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టడానికి అరడజనుపైగా చిన్నా, పెద్ద చిత్రాలు వస్తున్నా, ప్రధానంగా మూడు భారీ చిత్రాలు పోటీపడుతున్నాయి. అవి రజనీకాంత్ ‘రోబో’, మహేష్ ‘ఖలేజా’, ఎన్టీఆర్ ‘బృందావనం’.
రోబో...తారాగణం: రజనీకాంత్, ఐశ్వర్యరాయ్
నిర్మాణ వ్యయం: రూ.180 కోట్లు (తెలుగు అనువాద హక్కులు 27 కోట్లు)
నిర్మాత: కళానిధి మారన్, దర్శకత్వం: శంకర్
ప్రత్యేకత: ఏసియాలోనే భారీ బడ్జెట్ చిత్రం.
రజనీయే హీరో, విలన్. ప్రపంచ వ్యాప్తంగా 2,250 ప్రింట్లతో విడుదల....
బృందావనం...
తారాగణం: ఎన్టీఆర్, కాజల్, సమంత,కోట, ప్రకాష్‌రాజ్,శ్రీహరి
నిర్మాణ వ్యయం: రూ. 38 కోట్లు, నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
ప్రత్యేకత: ఎన్టీఆర్ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం...
నిర్మాణ వ్యయం: రూ. 38 కోట్లు, నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
ప్రత్యేకత: ఎన్టీఆర్ కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం...
ఖలేజా...
తారాగణం: మహేష్, అనుష్క
ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, సునీల్
నిర్మాణ వ్యయం: రూ. 40 కోట్లు
నిర్మాతలు: శింగనమల రమేష్‌బాబు, సి.కళ్యాణ్
దర్శకత్వం: త్రివిక్రమ్
ప్రత్యేకత: మహేష్ సరికొత్తగా కనిపించే ప్రయత్నం.
ప్రత్యేకమైన కెమెరా వర్క్....
తారాగణం: మహేష్, అనుష్క
ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, సునీల్
నిర్మాణ వ్యయం: రూ. 40 కోట్లు
నిర్మాతలు: శింగనమల రమేష్‌బాబు, సి.కళ్యాణ్
దర్శకత్వం: త్రివిక్రమ్
ప్రత్యేకత: మహేష్ సరికొత్తగా కనిపించే ప్రయత్నం.
ప్రత్యేకమైన కెమెరా వర్క్....
దర్శకుడు శంకర్.... కథానాయికగా రజనీ సరసన ఐశ్వర్యరాయ్ తొలిసారిగా చేయడం, సన్ పిక్చర్స్ సంస్థ ఏషియాలోనే భారీ బడ్జెట్ 180 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించడం, ఎ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చడం, తెలుగు అనువాద హక్కులు రికార్డుస్థాయి ధరలో 27 కోట్లకు అమ్ముడుపోవడం... ఇన్ని ఆకర్షణలతో వస్తున్న రోబో
చిత్రంపై విపరీతమైన అంచనాలున్నాయి.
సన్‌పిక్చర్స్‌సంస్థ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసింది. ఐశ్వర్యరాయ్ ఇంతకుముందు చూడనంత అందంగా ఇందులో కనిపిస్తుందంటున్నారు. ఎ.ఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు ఫర్వాలేదనిపించాయి. ఇక అరవై ఏళ్ల వయసులో కూడా నటనలో, ఫైట్స్‌లో, స్టెప్స్‌లో, నడకలో, మాటలో ఎక్కడా చిన్న లోపం లేకుండా చేసే రజనీ ఈ చిత్రంలో కూడా తన ప్రత్యేకమైన మేనరిజమ్స్, స్టయిల్స్, గెటప్స్‌లతో రెచ్చిపోయాడట. ఇందులో రజనీ సినిమాలో వుండే హంగులు, ఆర్భాటాలు, వింతలు, విశేషాలు అన్నీ ఉన్నాయంటున్నారు.......
ఇక మహేష్ ‘ఖలేజా’ విషయానికొస్తే... రోబో వచ్చిన వారం వ్యవధిలో అక్టోబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న మహేష్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ‘దైవమ్ మానుష్య రూపేణా’ అనే థీమ్‌తో ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించాడు. మహేష్ సాధారణ సరదా టాక్సీ డ్రైవర్‌గా నటించాడు. ఇందులో ఎప్పటిలా నెమ్మదిగా కాకుండా గట్టిగా మాట్లాడతాడట.....
అంతేకాక ఈసారి డాన్స్‌లో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మంచి ఎనర్జీ మహేష్ ప్రదర్శించాడంటున్నారు. మహేష్ ఇంతవరకు మనం చూడని కొత్తకోణంలో కనిపిస్తాడట. ఇంతకుముందు ఆయన పోషించిన పాత్రలకు భిన్నంగా ఎనర్జిటిక్‌గా డిజైన్ చేసారు త్రివిక్రమ్. ‘ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రమని, సందేశాలు ఉండవని, సహజత్వానికి దగ్గరగా ఉంటుందని’ మహేష్ చెబుతున్నారు. ఆయన తొలిసారిగా పూర్తిస్థాయిలో హాస్యాన్ని పండిస్తాడని, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఐటమ్‌గై, యాక్షన్ హీరో, లవర్‌బాయ్ ఇలా ఆల్‌రౌండర్‌గా మహేష్ తన ప్రతిభను చూపించాడని, అలాగని ఇది ప్రయోగాత్మక చిత్రం కాదని, ట్రీట్‌మెంట్ వైవిధ్యంగా ఉంటుందని , మహేష్ ఈ చిత్రానికి అసోసియేట్ స్క్రిప్ట్ రైటర్‌గా కూడా వర్క్ చేసాడని త్రివిక్రమ్ పేర్కొంటున్నారు.
ఇక కేవలం ‘ఖలేజా’ వచ్చిన ఒక్కరోజు గ్యాప్‌తో ‘బృందావనం’ వస్తోంది. ఇప్పుడున్న యువహీరోల్లో అందరికంటే ముందే మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈసారి క్లాస్ ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నం ఈచిత్రంలో చేయడం... హీరోలతో సంబంధం లేకుండా కథను నమ్ముకుని ఇంతకుముందు హిట్‌లు కొట్టిన దిల్‌రాజు ఈసారి స్టార్‌తో సినిమా చేసినా కథకే ప్రాధాన్యం ఇచ్చానని చెప్పడం... కాజల్, సమంత ఎన్టీఆర్ సరసన తొలిసారిగా గోపికలుగా నటించడం ఈ చిత్రంపై అంచనాలను పెంచింది....
థమన్ సంగీతంలోని పాటల్లో తెలుగు నేటివిటీ మిస్సయింది. ఎక్కువశాతం తమిళ ఫ్లేవర్ కనిపించింది. పాటలు యావరేజ్‌గా ఉన్నా, ఎన్టీఆర్ తన డాన్సులతో పాటల రేంజ్‌ని పెంచుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ ఓ సన్నివేశంలో కృష్ణుడిగా కనిపిస్తాడు. దిల్‌రాజు ఏమాత్రం రాజీపడకుండా 38 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించాడు. తొలుత వరసగా నాలుగు సూపర్ హిట్స్ ఇచ్చిన దిల్‌రాజుకి ‘మున్నా’ బ్రేక్ చేసాడు. ఆ తర్వాత వచ్చిన ‘పరుగు’ పరుగెత్తకుండా పాకింది. తమిళ చిత్రాన్ని ‘ఆకాశమంత’ పేరుతో అనువదించి అభిరుచిని చాటుకున్నా, అదీ ఆశించిన హిట్ కాలేదు. నాగచైతన్య ‘జోష్’ మిస్ కాగా, క్లాసిక్ లవ్‌స్టోరీ ‘మరో చరిత్ర’ను రీమేక్ చేసి చరిత్రకు చెదలెక్కించాడు. ‘రామరామ కృష్ణ కృష్ణ’ తీసి హేరామ్ అనిపించాడు. ఇలా వరస పరాజయాలు ఎదుర్కొంటున్న దిల్‌రాజుకి ఈ చిత్రంతో మళ్లీ తన జడ్జిమెంట్ ఆడియన్స్ పల్స్‌ని క్యాచ్ చేస్తుందని, సక్సెస్ ట్రాక్‌లోకి వస్తానని, అన్నివర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరించి ఎన్టీఆర్ అందరివాడనిపించుకుంటాడని దిల్‌రాజు చాలా నమ్మకంగా చెబుతున్నారు. బృందావనం చిత్రాన్ని ‘ఓల్డ్‌వైన్ ఇన్ న్యూబాటిల్’గా రూపొందించారని తెలుస్తోంది.....
సినిమా ఎలా ఉంది, టాక్ ఏమిటి, ఎలా ఆడుతోంది అనే దానికన్నా ప్రాఫిట్ ఎంత అనేదే సక్సెస్‌కి కొలమానంగా చెబుతారు. మరి ఈ దసరా బరిలో దిగి నిలదొక్కుకునేవి టెక్నికల్ హంగామాతో వస్తున్న రజనీ ‘రోబో’నా? మహేష్ యాక్షన్ ఎంటర్‌టైనరా? ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనరా? అనేది కొద్దిరోజుల్లోనే తెలిపోనుంది. బరిలోకి దిగిన ఈ మూడు చిత్రాలు వేటికవే ప్రత్యేకతలతో వున్నా, వీటిలో బాక్సాఫీసు తూకం వద్ద ఏది ఎక్కువ బరువు తూగుతుందో దసరా సాక్షిగా వెండితెరపై చూడాల్సిందే....
No comments:
Post a Comment