Monday, September 27, 2010

"మహేష్ బాబు" కీ అక్టోబర్ భయం..."ఖలేజా" కూడా మహేష్ అక్టోబర్ సునామి లో ఇరుక్కుంటుంద...?



మహేష్ బాబు...ఆరు అడుగుల చాక్లాట్ ఫ్యాక్టరీ.మహేష్ అంటే ఎంత ఇష్టమో "ASTACHAMMA" లో స్వాతి నీ అడగండి వివరం గా చెబుతుంది......అంత అలా సౌత్ ఇండియన్ ఫిలిం జనాలని మాయ చేసేసాడు.......ఇప్పటికి పెళ్లి అయిన సరే మహేష్ అనే పేరు తలవగానే అమ్మయిలు ఆదోల అయిపోతారు.....

ఇంతకి చెప్పోచేది ఏమిటి అంటే.....ఇంత అందం ఉన్న ఈ అందగాడికి ఇప్పుడు "అక్టోబర్" ఫీవర్  పట్టుకుంది..ఏమిటి అంటారా చెబుత వినండి....


30-10-2002.... అంటే అక్టోబర్ 30 నా మహేష్ బాబు కొత్త లుక్ తో దర్సకేంద్రుడు "రాఘవేంద్ర రావు" దర్సకత్వం లో వచ్చిన చిత్రం "బాబి"...అప్పటికి అంధగత్తె  "ఆర్తి అగర్వాల్" తో కలిసి  నటించిన "బాబి" సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బొక్క బోర్ల పడింది...పాపం మన మహేష్ మొహం నవ్వు లేదు కదా అక్టోబర్  అంటే కొంచెం వణుకు పుట్టింది.....

ఇంక..."నాని" అక్క గారు మహేష్ కెరీర్ కీ పెద్ద బొక్క పెట్టిన సినిమా.....చిన్న పిల్లడు అంట పెద్దాడు అవుతాడు  అంట ఏదో ఏదో....చెప్పేసింది అంతే జనం "తల్లో!.....నీకో నమస్కారం......" అని పారిపోయారు సినిమా హాలు నుంచి.......ఈ దెబ్బకి మన మహేష్ కీ ఒక సామెత  గుర్తువచ్చింది.....ఆదే "తమ్ముడు తమ్ముడే......పేకాట పేకాటే...." అన్నట్టు "అక్క ఇంటి వరకే.....న సినిమాకు మాత్రం పెట్టకు పెద్ద  బొక్క" అని డిసైడ్ అయిపోయాడు......దెబ్బకి పాపం మన మహేష్ కీ అక్టోబర్ అంటే బయం పుట్టింది.......

చివరాకరికి ఒక రాయి వేద్దాం  అని...."అతిధి" ల వచాడు....ఇంట్లో వాళ్లనే సరిగ్గా చూడని ఈ రోజుల్లో "అతిధి" దేవో భవ! అని అంటామ...వెళ్ళు బాబు వెళ్ళు అని జనాలు తరిమేసారు....అంతే ఇంక అప్పటి నుంచి అక్టోబర్ అంటే మహేశ్ బాబు  జడుసుకున్నాడు.......

ఎం చేస్తాం ఎంత కాదు అనుకున్న మళ్ళి మళ్ళి అక్టోబర్ వదల నిన్ను వదల అని వచ్చింది "ఖలేజా" రూపం లో...ఈ సారి అయిన ఖలేజ చూపిస్తాడు అని ఆశిద్దాం...

మీరు ఎం అంటారు  ఖలేజా హిట్ అయ్యి అక్టోబర్ భయం నుండి బయట పడతాడ లేక మళ్ళి పాత పాటే పడతాడ......టీవీ చానల్స్ ల SMS పంపండి అని అనను ఒక కామెంట్ రాయండి "హిట్" ఓర "సూపర్ ఫ్లాప్" అవునా kaadha  అని.....

No comments: