Thursday, September 9, 2010

పిల్లలతో శృంగార "ఆటా" భంగిమలా.........?


 

అన్నయ్య...తెలుగు నేల మీద ఈ పదానికి చాల గౌరవం ఉంది...ఒక్క మన తెలుగు లోనే కాదు తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్ ఎలా పరతి బాషలో "అన్నయ్య" అంటే ఎనలేని అభిమానం.....తల్లితండ్రులు తర్వాత అన్నయ్యే చిన్నవాళ్ళకి దిక్కు.....


కానీ కొద్ది రోజులుగా సోమ మంగల వారలు మాత్రం ఈ అన్నయ్య అనే పదానికి అర్ధం మారిపోతుంది.....ఏమిటో విచిత్రం "నిక్కరు వేసుకున్న బుడ్డోడికి అన్నయ్యే....నిక్కర్లో నిక్కర్ వేసుకున్న పడుచువాడికి అన్నయ్యే..."


ఐదారేళ్ల చిన్న పిల్ల శృంగార భంగిమలు చూపిస్తుంటే ఏమనిపిస్తుంది? ఎవరైనా అదేం రోగం అనుకుంటారు. అదే టీవి చానళ్లలో రియాల్టీషోల పేరుతో చిన్నపిల్లలతో శృంగార భంగిమలు చూపితే ఏమనుకుంటారు. ఇంట్లో కూర్చొని టీవి చూసే వారు ఛీ.............అనుకుంటారు. అదే షోలో పాల్గొంటున్న ప్రేక్షకులో, న్యాయనిర్ణేతలో అయితే ఈల వేసి ప్రోత్సహిస్తారు. ఈ రెండు వర్గాలకు కాకుండా బాధ్యతాయుతంగా ఆలోచించే వారు సైతం ఉంటారని కొందరు నిరూపించారు. టీవిల్లో ఇలాంటి దిక్కుమాలిన దృశ్యాలను చూసి తిట్టుకుని చెడిపోయిన ఈ సమాజాన్ని ఎవరూ బాగుచేయలేరు అని బాధపడి ఊరుకోకుండా కొంతమంది మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు...........

జీ టీవిలో ఆట పేరుతో చిన్నపిల కోసం ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశం ఉంటే మంచిదే! కానీ ఈ కార్యక్రమంలో జరుగుతున్నది అది కాదు. పచ్చి శృంగార భంగిమలను చిన్నపిల్లలు ప్రదర్శిస్తున్నారు. కామాన్ని రెచ్చగొట్టే విధంగా పిల్లలతో భంగిమలు చూపుతున్నారని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వారు టీవి చర్చల్లో విమర్శించారు. సినిమాల్లో పచ్చిపచ్చిగా ఉన్న ఐటిమ్‌సాంగ్స్‌పై పిల్లలతో వికార చేష్టలను ప్రదర్శిస్తున్నారు. దానికి పెద్దల చప్పట్లు, ఈలలు. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగానే జీలో ప్రసారం అయినా ఆట కార్యక్రమంలో పిల్లల వికార చేష్టల నృత్యం దృశ్యాన్ని టీవి 5 ప్రసారం చేసింది.........

ఈ ఆర్టికల్ మీద దయచేసి మీ స్పందన తెలియచేయండి.......కామెంట్ చేయడం మర్చిపోకండి.....
ఓంకార్....రచించి....వడ్డించిన.."ఆట" షో అంటే మొదట్లో చాలా ఆట గ ఉండేది...కానీ juniors అంటూ పిల్లలు చేత భూతు పాటలికి డాన్స్లు వేయిస్తున్న ఈ ప్రోగ్రాం అంటే చిరాకు కాదు కాదు కంపరం పుడ్తుంది.......


చివరిగా తల్లితండురులికి ఒక చిన్న మనవి....."మనలో ఉన్న కళ మనకి పేరుని తీసుకురావాలి....అంతే కానీ ఉన్న పరువుని తియకుడదు"..అయిన మా పిల్లలు వేస్తే మాకు లేని దురద మీకు అందుకు అని మీరు మమ్మలిని అడగచ్చు....నిజమే కానీ ఆ దురద మంట మీకు పుట్టదు మీ పిల్లల కీ మీ బంధువులకి పుడుతుంది....
అప్పుడు అయిన మీ పిల్లలు రోడ్ మీద వెళ్తుంటే...ఎవరు అయిన చూసారు అనుకోండి ఎం అంటారు...."ఆదే రా!.....మొన్న జోతిలక్ష్మి పాటకి డాన్సు వేసింది కదా....ఎం ఉంది రా గుంట ఎప్పుడే ఎట్లా ఉంది అంటే రేపు పాయిట వేసాక పిట పిట లడాతడి కదా రా....." ఏవి మీరు వినబోయే మాటలు.....ఆలోచించుకొండి......

ఈ ఆర్టికల్ మీద దయచేసి మీ స్పందన తెలియచేయండి.......కామెంట్ చేయడం మర్చిపోకండి.....

 

6 comments:

ప్రేమిక said...

hmm nenoka vishyam cheppaalnukuntunnna.... idi mee post ki exact comment kadulendi ....

ninna night 10 ki tv pettanu nidra pattaka.. programs chudandi...

sakshi- ramoji tidutu oka program
tv9- jagan pina oka program
etv- dhee anta evato pichi dress veskuni dance chesindi( naku dance anipinchaledu oka chair chuttu kasepu tirigindi)
maa tv- gharshana anta vadevado gymnastics chesadu adi dance avuna kada ani kottukuntunnaru
tv5- crime watch anukunta...
zee telugu- ee channel chudaledu akkada kuda omkarame vinabadutundemo ani

Praveen Mandangi said...

ముక్కూ మొహం తెలియనివాళ్లని అన్నయ్య, అంకుల్, ఆంటీ అని పిలవడం ఇప్పుడు ఫాషన్. ఆ పదాలకి అర్థాలు మారిపోయాయి. అందరూ అలా కాదు. చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో పక్కింటి అమ్మాయిని అక్కా అని పిలిస్తే 'నీకు నాకు ఏమైనా బంధుత్వమా?' అని ఆ అమ్మాయి అడిగింది. పక్కింటి అబ్బాయిని అన్నయ్య అని పిలవడం, పక్కింటి అమ్మాయిని అక్కా అని పిలవడం అనవసరమే. ఆశ్చర్యం ఏమిటంటే ఉన్న బంధుత్వాలని గౌరవించనివాళ్లు కూడా లేని బంధుత్వాలు కలుపుకోవడం.

Unknown said...

good review.
tappu vaallade kaadu, manadi kooda.
allanti karyakramalu chudatam maaneste sari. tv lo manaku upayogapade program vaste choodham ledante tv off cheyyadame manchidi.
tv lekapothe hayiga andaritho kalasi kaburlu cheppukovachu, pillalu pedhalu kalasi aadukovachu. inka manaku nachina music vinavachu. meere aalochinchandi raatri tv chustu mara manushulla bhojanam cheyyadam tappa family anta kalasi bhojanam chesina roju unda. tv chudatam taggiste kutumba bandhalu balapadatai. endukandi tappulu evarimeedano vestaru.

kadambari said...

ఏవి మీరు వినబోయే మాటలు.....ఆలోచించుకొండి......

ఆ parents ఇప్పటికే వింటూన్నారేమో????????????
ఏమో మరి?
తెరపైన తమ పిల్లలు కనబడాలనే ఉబలాటం,
ఆ తల్లి దండ్రుల ఆలోచనలను ఇలాగ మార్చేసిందేమో?????
ప్చ్!ఆ parents ఇప్పటికే వింటూన్నారేమో???????
ఏమో మరి?

Ushassu said...

avunandi.. em dance adi.. inka adi chaladu annattu prathi 5 minutes ki oka godava.. asalu e omkar programs annintini apeyyali...

SJ said...

pillalaki protsaham ivvali gani ila cheyadam tappu.reality show lo real enta untundo evarikina telusa??its like a serial...script rasi act cheyistarata...