Monday, September 20, 2010

"కొమరం పులి" సినిమా ఫ్లాప్ కీ కారణాలు....





ఆశయం మంచిదైతే చాలదు..ఆచరణ ముఖ్యం అంటారు..అదే విధంగా సినిమా కాన్సెప్ట్  మంచిదైతే చాలదు..దాని తెరకు అనువాదం చేయగలగడం ముఖ్యం ఈ విషయంలో సాంకేతిక నిపుణులు ఎవరినీ నిందించి లాభం లేదు..వారిని జనరంజకంగా వాడుకోవడంలో విఫలమైన దర్శకుడే కర్త.. కర్మ.. క్రియ. అతడే కొమరం పులి పాలిట మెయన్ విలన్....



మూడేళ్ల పాటు నిర్మాత నానా కష్టాల పడి, కోట్లు వెచ్చించి, కోర్టులు తిరిగి జనం ముందుకు తెచ్చిన ‘కొమరం పులి’ వైఫల్యానికి ఆరు కారణాలేం ఖర్మ..అరవై కారణాలు చెప్పొచ్చు.






  • కొమరం పులి..పవర్ ఫుల్ టైటిల్, పవర్‌స్టార్ అనిపించుకున్న హీరో, కోట్ల ఖర్చు. కానీ.. సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంలోనూ వైఫల్యమే. దర్శకుడిగా ఎస్.జె. సూర్యది ఇందుకు పూర్తి బాధ్యత. అసలు కథే నేలవిడిచి సాము చేసింది.....

  • సినిమా ప్రారంభం కావడమే, స్లో పేస్‌లో ప్రారంభమవుతుంది. థాయిలాండ్‌కు స్కిప్ అయిన తరువాత భయంకరమైన స్పీడందుకుంటుంది. ప్రేక్షకుడిని తన వెనక తీసుకెళ్లే బదులు, దాని వెనుక పరిగెత్తలేక అతడునీరసపడేలా చేస్తుంది. ఎంత అడ్వాన్స్‌డ్ సినిమా అయినా సామాన్య ప్రేక్షకుడిని విస్మరించకూడదు కదా.

  • కథలో ఆశయం బాగుంది. కానె్సప్ట్ ఓకె. డైలాగులు మంచిగానే వున్నాయి. కానీ వాటి నిడివి సంగతి....తమిళ జనానికి నచ్చేలా పుంఖానుపుంఖాలుగా డైలాగులు రాసి, వాటిని గుక్కతిప్పుకోకుండా చెప్పించి, అసలు ఏంజరుగుతోందో జనానికి అర్ధం కాకుండా చేసినందుకో, ఎడిటింగ్ అనేది సినిమాకు ఎంతవరకు ముఖ్యం అన్న సంగతే మర్చినందునో...మొత్తంమీద, చతికిలపడిపోయింది.

  • దర్శకుడి అతితెలివి తేటలవల్లో, శంకర్ లాంటి అగ్రదర్శకుడిని అనుకరించాలన్న ప్రయత్నం కారణంగానో, దమ్మిడీ అంత కథకు సరిపడా రూపాయంత స్క్రిప్టు సమకూర్చలేకపోగా, వంద రూపాయల హడావుడి చేసినందుకో,

  • అసలు పవన్‌కళ్యాణ్ అనే హీరో అభిమానులు అతగాడి ఏ పాటలు, ఫైట్లు చూసి ఆనందిస్తారో ఆ విషయం మర్చిపోయినందునో, తెలుగు ప్రేక్షకుల అభిరుచిని సూర్య గారు మర్చేపోయారు......

  • ఊ అంటే చాలు..బాయ్స్..అని అరవడం..జుయ్‌మని ఈ గ్యాంగ్ అంతా బయలుదేరడం. ఇప్పటికే డయిల్ 100 వుంది కదా..ఏ కాయిన్ బాక్స్ నుంచయినా, ఏ ఫోన్ నుంచయనా డయిల్ అవుతుంది కదా..దానికి ఖర్చేలేదుగా..మరి ప్రతి స్టేషన్ ముందు ప్రత్యేకమైన బూత్ ఎందుకట..మినిమం కామన్‌సెన్స్ వుండాలి కదా.

  • ఇక హీరోయిన్ ఎంట్రీ....సడెన్‌గా ప్రత్యక్షమై, హీరోని నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకో అనడం ఏమిటి? హీరోయిన్ ఎంట్రీ ఇలాగేనా వుండేది? పైగా హీరో, హీరోయిన్ల పెళ్లి సీన్...ఓకె. అదీ వదిలేద్దాం.. ఫస్ట్‌నైట్ కోసం హీరోయిన్,హీరోను కవ్వించే సీన్ అటు రొమాంటిక్‌గా లేదా ఇటు కామెడీ కాక..తలపట్టుకునేలా చేసిందంటే, ఆ పాపం ఎవ్వరిది?

  • కాస్సేపు హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో వుండే విలన్, హీరో, నెక్స్ట్ ఫ్రేమ్‌లో విదేశాల్లో కనిపించడం అంటే, దర్శకుడి నిర్లక్ష్యం అనాలా? వద్దా?

  • అసలు పాటల్లో కెమేరా కొన్ని సెకండ్లపాటయినా హీరో, హీరోయిన్లపై స్థిరంగా నిల్చుందా? అభిమాన జనానికి కావాల్సిన డ్యాన్స్ మూమెంట్‌లకు అనుగుణంగా పాటల ట్యూన్లు వున్నాయా? పవన్ కళ్యాణ్ పాటలకు,డ్యాన్సులకు అభిమానులు ఇష్టపడే ఒక స్టయిల్ అంటూ వుంది కదా..దాన్ని విస్మరిస్తే ఎలా? అని ఆలోచించారా? 

  • పబ్‌లో ఐటమ్ సాంగ్ ఇనుస్ట్రుమెంటేషన్‌కు ఏ కొరియాగ్రాఫర్ మాత్రం అంతకన్నా మూవ్‌మెంట్‌లు ప్లాన్చేయగలడు...ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు పట్టించుకోవాల్సి వుండీ, పట్టించుకోని వైఫల్యాలు ఎన్నని..

  • రెహమాన్ పాటలు సినిమాలో కన్నా బయటే బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోసో. డబ్బింగ్ డైలాగులు వినడానికి బాగుండొచ్చు..విషయం వుండొచ్చు..కానీ ఉపన్యాసాల్లా వుండకూడన్న విషయాన్ని స్పష్టం చేసాయి.

దీని పై మీ స్పందన కామెంట్ రూపం లో తెలియజేయండి.....మీ కామెంట్ మాకు మరింత మంచి పోస్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది.....

1 comment:

Balu said...

విడుదల కి ముందే హడావుడి ఎక్కువ చేసి, ఫ్లాప్ అవుతుందని ఊహించబడిన సినిమాల కోవలోకి కొమరం పులి వస్తుంది. అందుకని వేరే కారణాలు వెతకనవసరం లేదు.