వెనకటికి ఒక సామెత ఉంది...."కూర్చోడానికి చోటు ఇస్తే పడుకోడానికి అడిగాడు అంట" అట్లా ఉంది తమిళ తంబిల పరిస్థితి.
కళాకారులికి బాషబేధాలు ఉండక్కర్లేదు.కానీ కళాకారులకి గుర్తింపు ప్రాదాన్యం తప్పనిసరి కదా.మరి తెలుగు సినిమా లో తమిళ నటులు ఉంటారు.....మరి ఎందుకు తమిళ సినిమాల్లో తెలుగు నటులు ఉండరు.....అంటే మన వాళ్ళు నటించార లేక వాళ్ళు తీసుకోరా.
పై వాటికీ సమాదానం తర్వాత చెప్తాం ముందు తెలుగు సినిమా నీ మిగేస్తున్న తమిళ తంబిలను చూద్దాం."శంకర్" సినిమా అంటే తెలుగు సినిమాతో సమానం.ఇంక "రజినీకాంత్" సినిమా అంటే ఎ తెలుగు సినిమా అగ్ర నటుడికి దక్కని జన సందోహం ఆయిన సినిమా విడుదల అయినతర్వాత సినిమా ధియటర్ దగ్గర జనం నీ చూస్తే తెలుసుతుంది "రజిని" కీ తెలుగు లో ఎంత స్టార్ స్టేటస్ ఉందో.తమిళ సినిమా ఒరిజినల్ తీస్తే మనం కోట్లు ఖర్చు పెట్టి డబ్బింగ్ హక్కులు కొంటాం.
మరి తెలుగు సినిమా కీ అంత గౌరవం దక్కుతుందా తమిళ తంబిల దగ్గర........?పోనీ దక్కిన కేవలం రీమేక్ హక్కులు పొందుతారు తప్ప డబ్బింగ్ హక్కులు మాత్రం తీసుకోరు.....? ఎందుకు తెలుగు సినిమా అంటే అంత చులకన....?
వ్యాపారానికి హద్దులు ఉండకర్లేదు....కానీ కొంత హృదయం ఉండాలి కదా.
"మణిరత్నం" తీసిన 'విలన్' సినిమా లో ఒక్కడంటే ఒక్క తెలుగు నటుడికి అవకాశం లేకుండా తీసాడు మణిరత్నం.అందులో మలయాళ స్టార్ కీ పెద్ద వేషం ఇచ్చాడు.అంత గొప్ప సినిమాలో తెలుగు నటుడు మచ్చుకు ఆయిన కాగడా పెట్టి వెతికినా కానరాడు.కానీ,"విలన్" సినిమా రిలీజ్ అయతే మాత్రం మనం సిగ్గు లేకుండా పోలో మని పోయాం.
ఇంక ఇప్పుడు కలక్షన్ల సునామి సృష్టిస్తున్న రజిని "రోబో" లో కూడా ఒక్క తెలుగు ముఖం లేదు."దేవదాస్ కనకాల" కీ చిన్న వేషం ఉందంట కానీ ప్రస్తుతం ఆది చాలా వరకు ఎడిట్ చేసుకుంటూ పోయారు.హిందీ నుంచి డేని కీ,ఐశ్వర్య కీ చోటు దక్కింది తెలుగు వాడికి మాత్రం చిక్కలేదు.
తెలుగు లో సినిమా తీయాలి అంటే వెంటనే ముంబై కీ ఫోన్ కలుపుతారు,నటినటులిని తెచ్చుకుంటారు.తమిళ,కన్నడ,మలయాళ బాషల నుంచి పిలిపించి ఖరీదయిన సోఫా లో కుర్చోపెడతారు.కానీ అవతలివైపు మనకి సోఫా వేయకపోయినా పర్వాలేదు కనీసం మొక్కాలి పీట ఆయిన దక్కుతుంద లేదా చూసుకోరు.
మొన్నటికి మొన్న "ఈనాడు" సినిమాను తెలుగు తమిళ బాషలలో తీసారు కమలహాసన్.ఇందులో "వెంకటేష్" కీ పెద్ద పాత్ర ఇచ్చారు కానీ మిగతా నటులు అంత తమిళ వాళ్ళే పోనీ ఆది వదిలేద్దాం మరి ఆదే సినిమా నీ తమిళ వెర్షన్ లో మాత్రం "వెంకటేష్" కీ బదులు "మోహన్ లాల్" కనిపిస్తారు.అంటే తమిళ సినిమాలికి "వెంకటేష్" సరిపోడ...ఆయిన మొఖం బాగోద లేక ఆయిన సరిగ్గా తమిళం రాదా....ఈ ప్రశ్నలకి సదరు నిర్మాత "కమల్ హసన్" జవాబు ఇవ్వాలి మరి.....
ఇదంతా ఏదో వ్యతిరేకత కొద్దో ఇష్టం లేకనో చెప్పడం లేదు.తెలుగువారిది విశాలమయిన హృదయం.ఆది మరి ఇంత విశాలం అయతే మరి అనర్దం.
వెనకటికి ఒక సామెత ఉంది...."కూర్చోడానికి చోటు ఇస్తే పడుకోడానికి అడిగాడు అంట" అట్లా ఉంది తమిళ తంబిల పరిస్థితి.
దీని పై మీరు మీ అబ్రిప్రయలు తెలపండి...తెలుగు సినిమా నీ ఎట్లా కాపాడలో మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.....
6 comments:
నిజం. చూస్తున్నాం కదాని ప్రతీ చెత్త సినిమానూ మనమీదకు వదులుతున్నారు తమిళోళ్ళు. అయినా, మనోళ్ళకు కూడా బుద్ధుండాలి. మా సామాజిక వర్గం హీరో, మా సామాజిక వర్గం హీరో అని కొట్టుకుంటూ మధ్యలో తమిళోళ్ళకు మాంచి బిజినెస్ వచ్చేలా చేస్తున్నారు.
''మనవాల్లుత్తి వెధవాయ్ లోయ్ '' అని ఊరికనే చెప్పలేదు మహానుబావులు.
అయిన నువ్వు పడుకోక ఇంకొకన్ని పడుకోనివ్వక ....(NO DOUBLE MEANING)తెలుగు ప్రేక్షకులు ఏమై పోవాలి.
ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదే
కర్నాటకలోకూడా ఇలా ఆలోచించే ఇప్పుడు ఈ స్థాయికొచ్చారు ;)
ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదే
కర్నాటకలోకూడా ఇలా ఆలోచించే ఇప్పుడు ఈ స్థాయికొచ్చారు ;)
తమిళ్ సినిమాలే ఆంధ్రాలో రాజ్యం చేస్తున్నాయని బాధపడుతున్నాం. సీరియల్స్ మొత్తం డబ్ చేసి వదుల్తున్నారు. భాష తప్పులతోగాని, తమిళ్ వాసనలతో గాని ఉంటుంది.
పాటల పోటీల్లో మూడింట నాలుగొంతులు డబ్బింగ్ సినిమా పాటలే పాడుతున్నారు. (సంగీతానికి భాషాభేదం లేదని నాకూ తెలుసు. నాకూ ఎన్నో తమిళ్ పాటలు ఇష్టమైనవి ఉన్నాయి. తమిళే కాదు, హిందీ, కన్నడ, మళయాళ పాటలు కూడా ఇష్టపడతాను. అంతమాత్రాన పోటీలో పాడడానికి మన పాటలు మంచివి లేనేలేవా?)
తెలుగుదనం ఏమైపోతుందో, ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో! పఠనాసక్తులు, రచనా పటిమలు, పోషకరాజులు, సభలు, ఇష్టాగోష్టులు మృగ్యమై పోతున్న ఈ రోజుల్లో భాషా పరిరక్షణ, వ్యాప్తికి ఇప్పుడు ముఖ్యంగా వాడుకోవాల్సిన ఆయుధాలు సినిమా, మీడియానే కదా! ఇవి ఇలా తగలడ్డాయి.
మన చేతగానితనానికి తమిళోళ్ళ మీదబడి ఏడవడం ఎందుకూ!
మన తెలుగు సినిమాల్లో తెలుగెంత? తెలుగు నటులు ఎక్కడ? తెలుగు హీరోయిన్లు ఎక్కడ? తెలుగు సాంకేతిక నిపుణులు ఎక్కడ? ఏముంది తెలుగు సినిమాల్లో తెలుగుదనం? గొప్పదనం?
Post a Comment