Tuesday, October 12, 2010

మహేష్ "ఖలేజా" సినిమా రివ్యూ ఒక్క ముక్కలో...హిట్టా లేక ఫ్లాప..?



మహేష్ ఖలేజా మూడేళ్ళ తర్వాత వచ్చిన సినిమా మీద నిజం చెప్పాలి అంటే మహేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.....పాపం ఆశ పూర్తిగా అడియాస అయిపోయింది.....


మీరు మరీను ఖలేజ సినిమా అంత చండాలంగా ఏమిలేదు..ఎందుకు అట్లా అడిపిసుకుంటారు అని మీరు నన్ను అనచ్చు......మీకు మీ మహేష్ మీద అభిమానం అట్లాంటిది కానీ ఎంత మహేష్ అయతే మాత్రం సినిమాలో కథ లేకపోతే హిట్ అంటే డబ్బా కొట్టినట్టు ఉంటుంది......


ఇంక మహేష్ ఖలేజ విషయంకీ వద్దాం....మీకో మేటర్ చెప్పాలి ముందు.....


ఎప్పుడు మాట్లాడని వాడు సడన్ గా వచ్చి గల గల యాంకర్ లా మాట్లాడితే ఎలా ఉంటుంది.....అబ్బో పిల్లడు మాటలు నేర్చాడు అనుకుంటాం.....కానీ ఆదే పని గా వాగితే ఇంక చాలా రా బాబు అనుకుంటాం.......


ఖలేజా విషయంలో జరిగింది ఆదే.....సినిమా బాగుంది..కామెడి బాగుంది......సినిమా అంటే మొత్తం కామెడి నేనా కథ అవసరం లేదా....హార్లిక్స్ డబ్బా చూపించి వేడినిల్లు తాగేయి అంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది.....


ఒక్క మహేష్.....త్రివిక్రమ్....మధ్యలో అనుష్క పాపా.....వీటిని చూపించి సినిమా చుసేయండి అంటే ఎలా ఉంటుంది.....?


సినిమా మహేష్ కొత్త లుక్ లో కనిపించాడు అని తెగ పొగిడేస్తున్నారు అందులో అంత గొప్ప లుక్ ఏముందో నాకు అర్ధం కావడం లేదు....."చందన" లో కోనాలిసిన గుడ్డ ముక్కలు "లైఫ్ స్టైల్" లో కొన్నారు అంతే తేడ......అలా వేసుకున్నపుడు అందరు కొత్తగా వింతగా  కనిపిస్తారు.......మహేష్ చాల బాగున్నాడు కదా అంటే తెల్ల తొక్క బాగోడా....దానికే కేక అంటే ఎలా అసలు.....


మహేష్ అంటే పడక మేము ఇలా చెప్పడంలేదు మాకు మహేష్ అంటే ఇష్టం.....కానీ ఇష్టం ఇంతల ఉంటె ఇష్టం కాస్త చిరాగ్గా మారుతుంది......


ఈ సినిమాలో ఎంత మహేష్ ఉంటె మాత్రం కొన్ని సన్నివేశాలు మరి వింతగా చుపించేసారు....."హీరో గారు ఒక పాపా నీ ఎత్తుకుంటే   బతికేస్తుంది అంట......అయతే మన మహేష్ నీ హైదరాబాద్ నిలోఫర్ లో ఉంటె మంచిది ఎవరు చచ్చిపోయిన ఎత్తుకుంటాడు బతికేస్తారు".....డైరెక్టర్ గారు ఎవరిని దృష్టిలో పెట్టుకొని సినిమా తీసారో అయినాగారే చెప్పాలి.......


ఇంక అనుష్క.....అసలు ఈ సినిమాలో పాటల కోసమే ఉన్నట్టు ఉంది.....వచ్చింది తాయి తక్కలు ఆడింది......రెండు  సన్నివేశాల్లో నవ్వించింది...పయికం పుర్చుకున్నాను వేరే సినిమా కీ పోయాను అంతే ఆమె పాత్ర......


సినిమా గురుంచి ఎక్కడ విన్న డైరెక్టర్...హీరో...అందరు రిచ్ రిచ్ అంటున్నారు...50 కోట్లు పెడితే రిచ్ కాకపోతే రిమ్మ తెగులు వస్తుందా......


దీని పై మీ కామెంట్స్ తెలపండి.....

2 comments:

Anonymous said...

తెలుగే సరిగ్గా రాయడం రాదు . ఒక్క లైన్ రాసావంటే అందులో వంద బూతులు ఉంటాయి. నువ్వు కూడా ఖలేజాని విమర్శిస్తే యెలా భయ్యా.

Anonymous said...

నీ తలకాయ్, ముందు నవ్వు తెలుగు ఇంగ్లీష్ సరిగ్గా రాయడం నేర్చుకో ఆతర్వాత తెలుగు సినిమాలు ఎలా తీయాలో నేర్పిస్తూ రివ్యూలు రాద్దువుగాని. మొన్న నీ ఎంగిలిపీసు రివ్యూ సగం చదివేటప్పటికి కడుపులో దేవేసింది.